PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంట‌ర్నెట్ లో జ‌నం ఏం వెతుకుతున్నారో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : క‌రోన లాక్ డౌన్ తో జ‌నం ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఇంట్లో ఖాళీగా ఉండ‌లేక‌… ఆన్ లైన్ కోర్సు నేర్చుకోవట‌మో.. మూవీస్ చూడ‌ట‌మో.. గేమ్స్ ఆడ‌ట‌మో.. యూట్యూబ్ వీడియోస్ తో టైం పాస్ చేస్తూ లాక్ డౌన్ కాలాన్ని జనం వెళ్లదీస్తున్నారు. ఫ‌లితంగా గ‌తంలో కంటే ఎక్కువ‌గా ఇంట‌ర్నెట్ డేటా వినియోగం పెరిగింది. ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. డౌట్ వ‌చ్చినా జ‌నాలు వెంట‌నే కంప్యూట‌ర్ల ముందు వాలిపోతారు. గూగుల్ సెర్చ్ ఇంజిన్ లోని వెళ్లి చ‌క‌చ‌క వెతికేస్తారు. అస‌లు జ‌నాలు గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఏం వెతుకుతున్నారు ? అన్న ప్రశ్నకు స‌మాధానంగా సులేఖ సంస్థ ఓ అధ్యయ‌నాన్ని వెల్లడించింది. దేశంలోని ఐదు ప్రధాన న‌గ‌రాల్లో ఇంట‌ర్నెట్ వినియోగ‌దారులు ఏం వెతుకుతున్నారు అన్న విష‌యం మీద అధ్యయనం చేసింది. మే 15 నుంచి జూన్ 15 వ‌ర‌కు దాదాపు రెండు ల‌క్షల మంది పై ఈ అధ్యయనం చేశారు. వీట‌న్నిటిలో కామ‌న్ గా.. బ్యూటీ పార్లర్స్, బ్యూటీ సెలూన్స్, పెట్ కేర్ స‌ర్వీసెస్, కంప్యూటర్ స‌ర్వీసింగ్ కు సంబంధించిన వివ‌రాల కోసం ఎక్కవ న‌గ‌రాల్లో సెర్చ్ చేశారు.

About Author