అక్రమ.. నాటు సారాబట్టీలపై దాడులు…
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాజశ్రీ కర్నూలు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఉలిందకొండ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి SHOగా విధులు నిర్వహిస్తున్న ట్రైనింగ్ డిఎస్పి పి. భావన అయిన నేను కర్నూలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, ఉలిందకొండ ఎస్సై, సి.నల్ల ప్ప, ఓర్వకల్ ఎస్సై రాజా రెడ్డి మరియు సిబ్బంది తోకలిసి ఈ దినం అనగా 21.01.2024 తేదీన కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మజరా గ్రామం కొల్లంపల్లి తండా చుట్టుపక్కల ప్రాంతాలలో తాండ ప్రజలు కొంతమంది అక్రమంగా నాటు సారా తయారు చేయడానికి ఏర్పాటు చేసుకున్న సారాబట్టీలపై దాడులు నిర్వహించి సుమారుగా 1800 లీటర్ల బెల్లం ఉటను ధ్వంసం చేయడం, 60 లీటర్ల నాటుసారా స్వాదీనం చేసుకోటం జరిగింది. 2024 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా కొల్లంపల్లి తండా గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా అక్రమంగా నాటుసారా తయారుచేసి చుట్టుపక్కల గ్రామాలలో విక్రయిస్తున్న సందర్భంగా నాటు సారాను సేవించి కొంతమంది గొడవలకు కారణం అవుతు, కొన్ని సందర్భంగా గ్రామాలలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం వుంటుంది కావున కొల్లంపల్లి తండా గ్రామ ప్రజలు ఇప్పటినుంచి నాటు సారా తయారు చేయడం, విక్రయించడం మానుకోవాలని కోరడమైనది. సారా తయారీమానని పక్షంలో చట్టపరంగా గట్టి చర్యలు తీసుకుంటామని, అట్టి వారిపై PD Act కూడా నమోదు చేస్తామని నాటుసారా తయారీ దారులను హెచ్చరించడం జరుగుచున్నది.