22న తుది ఓటర్ల జాబితా ప్రచురణ జరగాలి
1 min read– ఓటర్ల జాబితా పరిశీలకులు డి.మురళీధర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈనెల 22వ తేదీన బూత్ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు తుది ఓటర్ల జాబితా ప్రచురణ జరగాలని ఓటర్ల జాబితా పరిశీలకులు (ఏపీఎంఎస్ఐడిసి వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్) డి.మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు.ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓటరు తుది జాబితా ప్రచురణపై ఈఆర్ఓ, ఏఈఆర్ఓలతో ఓటర్ల జాబితా పరిశీలకులు సమీక్ష నిర్వహించారు..ఈ సందర్భంగా పాపులేషన్ రేషియో, జెండర్ రేషియో తదితర అంశాల గురించి రోల్ అబ్జర్వర్ ఆరా తీశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు అందించిన ఫిర్యాదులు పరిష్కరించారా అని అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ప్రకారం ఓటర్ల తుది జాబితాను ఈనెల 22వ తేదీన ప్రచురించడం జరుగుతుందన్నారు..బూత్ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ప్రచురణ జరగాలని, అదే రోజు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి రెండు సెట్ల ఓటర్ల జాబితాను వారికి అందజేయాలని కలెక్టర్ కు సూచించారు..ఎన్నడూ లేని విధంగా ఓటర్ల జాబితా తయారీ లో ప్రొసీజర్ ఫాలో కావడం జరిగిందని, తదనుగుణంగా జాబితాను చాలా జాగ్రత్తగా రూపొందించడం జరిగిందన్నారు….తుది ఓటర్ల జాబితా ప్రచురించినప్పటికీ కూడా అర్హులై మిగిలి ఉన్న ఓటర్లకు తప్పనిసరిగా ఓటు హక్కు కల్పించడం జరుగుతుందన్నారు..నాలుగు కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్లు ఉన్న అర్బన్, రూరల్ ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు…ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకుని రావాలని ఆయన ఈఆర్ఓ, ఏఈఆర్ఓలకు సూచించారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ఈ నెల 22 వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురణకు చర్యలు తీసుకుంటున్నామని పరిశీలకులకు వివరించారు .. అన్ని దరఖాస్తులను సరైన రీతిలో డిస్పోజ్ చేయడం జరిగిందని, డిస్పోజ్ చేసిన ప్రతి దరఖాస్తుకి డాక్యుమెంటేషన్ మైంటైన్ చేయడం జరిగిందని తెలిపారు.. రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన ఫిర్యాదులను పూర్తి స్థాయిలో పరిష్కరించడం జరిగిందన్నారు. ఓటర్ల జాబితాలో ఈపి రేషియో, జెండర్ రేషియో పై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు.. జెండర్ రేషియో లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని కలెక్టర్ వివరించారు.తొలుత జిల్లా పర్యటనకు విచ్చేసిన రోల్ అబ్జర్వర్/ఏపిఎంఎస్ఐసిడిసి వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్ రెడ్డి కి జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు, కర్నూలు ఆర్డీఓ హరిప్రసాద్ పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, మున్సిపల్ కమీషనర్ భార్గవ తేజ, ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఈఆర్ఓలు, ఎఈఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు.