అయోధ్యలోకి రాముడు.. మా ఇంట్లోకి సీతామహాలక్ష్మీ
1 min read* సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రసవం ముహూర్తం
* కిమ్స్ ల హాస్పిటల్ కర్నూలు లో ప్రసవం
* అయోధ్య ముహూర్తానికే డెలివరీ చేసిన వైద్యులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: దేశమంతా అయోధ్యలోని భవ్య రామమందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సుముహూర్తం కోసం ఎదురుచూసింది. సోమవారం (22వ తేదీ) మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమైనది. అదే సమయానికి కిమ్స్ కర్నూలు హాస్పిటల్ లో మనిమాల అనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రాముడు అంటేనే భారతీయుల్లో, అందునా హిందువుల్లో ఒక భావోద్వేగం. తమకు పుట్టబోయే బిడ్డ రాముడి అంశలోనే పుట్టాలన్న కోరిక ప్రతి జంటకూ ఉంటుంది. అందుకే, నెలలు నిండిన తన భార్యకు సరిగ్గా అదే ముహూర్తంలో ప్రసవం చేయాలని ఓ జంట కిమ్స్ హాస్పిటల్ కర్నూలు లోని డాక్టర్ శిల్ప రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ శిల్ప రెడ్డి మాట్లాడుతూ అయోధ్యలో రాముడు గుడిలోకి వచ్చిన ముహూర్తానికే ప్రసవం చేయాలని కోరారు. అదే విధంగా అదే సమయానికి ప్రసవం చేశాం. తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడుతూ అయోధ్యలో గుడిలోకి రాముడు వచ్చిన సమయానికి మా ఇంటికి సీతామహాలక్ష్మీ వచ్చింది. మాకు చాలా ఆనందంగా ఉంది. డాక్టర్ మా ధన్యవాదాలు.