అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గం.. సిపిఎం.. సిఐటియు
1 min readపల్లెవెలుగు వెబ్ పాణ్యం: రాష్ట్రవ్యాప్తంగా గత 43 రోజులుగా అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడాలని కోరుతూ నిరవధిక సమ్మె చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేయడం పెద్దదని 43 రోజులుగా మహిళలకు రోడ్లు ఎక్కిన దుస్థితి తీసుకురావడం దుర్మార్గమని ఇటువంటి సీఎం అధికారం ఉందని సమస్యలను పరిష్కారం చేయకుండా విజయవాడకు వెళ్లకుండా ఎక్కడికెక్కడ మహిళలను చూడకుండా అర్థరాత్రిలు స్టేషన్లో ఉంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా భయభ్రాంతులకు గురి చేయడం దుర్మార్గమని అంటూ మున్సిపల్ కార్యాలయం నుండి రాజారెడ్డి ఫంక్షన్ హాల్ వరకు వెళ్లి అరగంటపాటు రాస్తారోకో గంటపాటు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మధ్దులు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, కే మహమ్మద్ గౌస్ , కోశాధికారి పి వెంకట లింగం ల సిఐటియు పాణ్యం మండల కార్యదర్శి కె భాస్కర్ తోపాటు అంగన్ వాడీ యూనియన్ జిల్లా నాయకురాలు నాగరాణి లతోపాటు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు 100 మంది పాల్గొనడం జరిగింది అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేసేంతవరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రాబోయే కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి వైసిపి పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తామని జగన్ ప్రభుత్వానికి ఇవే చివరి ఎన్నికలని అన్నారు.