స్థానిక మాలలకే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి.. !
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అన్ని రాజకీయ పార్టీలు స్థానిక మాలలకే ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని మాల మహానాడు తాలూకా అధ్యక్షుడు పబ్బతి శివ ప్రసాద్ డిమాండ్ చేశారు.నందికొట్కూరు మాల మహానాడు కార్యాలయంలో సోమవారం మాల మహానాడు తాలూకా అధ్యక్షులు పబ్బతి శివప్రసాద్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధ్యక్షులు శివప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎస్సీ రిజర్వుడు స్థానాలైన కోడుమూరు , నందికొట్కూరు నియోజకవర్గాలలో ఏదో ఒక స్థానంలో ప్రతి పార్టీ మాలలకు టికెట్ కేటాయించాలని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రతి మాల సోదరుడు డిమాండ్ చేస్తున్నారు. ఏ పార్టీ అయినా మాలలకు టికెట్ కేటాయించకపోతే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ మరియు రెండు పార్లమెంటు నియోజకవర్గాలలో ఆపార్టీ ఓటమికి మాలలు కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. మాలలు ప్రతి పార్టీ లో ఉన్నారని, మాలలను విస్మరిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మేము ఏ ఒక్క కులానికి వ్యతిరేకం కాదని, అన్ని కులాలకు సమన్యాయం చేయాలని, ఇప్పటికే వైకాపా కోడుమూరు లో మాదిగలకు , నందికొట్కూరు లో మాలలకు కేటాయించిందని, తెలుగుదేశం పార్టీ కూడా ఏదో ఒక చోట మాలలకు టికెట్ ఇవ్వాల్సిందే అని మాలలందరూ డిమాండ్ చేస్తున్నారన్నారు. అలా చేయని పక్షంలో ఉమ్మడి జిల్లాలోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు తాలూకా మాల మహానాడు ఉపాధ్యక్షులు పీ.మధు.ఎన్.పుల్లన్న పట్టణ ఉపాధ్యక్షులు విల్సన్.మరియు కార్యకర్తలు.నాగేంద్ర విజయ్. శేఖర్.రాజు. నాగన్న హుస్సేన్ ఆలం తదితరులు పాల్గొన్నారు.