కర్నూలు.. కరాటే క్రీడాకారులకు పతకాలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్ణాటక రాష్ట్రంలోని సింధనూరులో జరిగిన రియల్ కరాటే ఛాంపియన్షిప్ లో కర్నూలుకు చెందిన 12 మంది క్రీడాకారులు పతకాలతో తిరిగివచ్చారు.మంగళవారం కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న యుకాన్ షాపింగ్ 4.ఫ్లోర్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన క్రీడాకారుల అభినందన కార్యక్రమంలో ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బి. రామాంజనేయులు ముఖ్యఅతిథిగా పాల్గొని అభినందించారు.ఈనెల 21వ తేదీన జరిగిన జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు పథకాలతో తిరిగి రావడం గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు వ్యాఖ్యానించారు. వివిధ వయసు కేటగిరీలలో గోల్డ్ మెడల్ సాధించిన గణేష్ సుదీష్ నుమేర్ రంజితులు గోల్డ్ మెడల్ సాధించినట్లు తెలిపారు. అలాగే రియాన్ ఉమర్ సిల్వర్ మెడల్స్ సాధించారు. కుందన వరప్రసాద్ దర్శు, గృహ రేవంత్ చెరిరాచికులకు బ్రాంజ్ మెడల్ లభించాయి. వీరందరికీ కపులతో పాటు మెడల్స్ వేసి ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జపాన్ రియో కరాటే ఇంచార్జ్ కెఎండి షకిల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాల రంగయ్య, రైల్వే హెల్త్ ఆఫీసర్ సుందర్ రాజ్, కరాటే మాస్టర్లు ఫక్రుద్దీన్, షేక్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.