కర్నూలు డి సి సి నూతన కార్యవర్గ జాబితా విడుదల
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గ జాబితా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే బాబురావు విడుదల చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబురావు మాట్లాడుతూ అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే మాజీ పిసిసి అధ్యక్షులు, సిడబ్ల్యుసి సభ్యులు శ్రీ గిడుగు రుద్ర రాజు మరియు పిసిసి నూతన అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలమ్మ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీని ప్రకటించడమైనదని ఈ కమిటీ నందు ఎనిమిది మంది ఉపాధ్యక్షులు, 9 మంది ప్రధాన కార్యదర్శులు, 11 మంది కార్యదర్శులు, 23 మంది సహాయ కార్యదర్శులు, ఒకరు అధికార ప్రతినిధి మొత్తం 52 మందితో జాబితా ప్రకటించడమైనదని బాబురావు తెలియజేశారు.అనంతరం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు బిజెపి ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు కలిగిస్తున్నందున బిజెపి కుటిల రాజకీయాలను మానుకోవాలని కోరుతూ బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి వైఎస్ షర్మిలమ్మ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగినది. ఈ నిరసన కార్యక్రమం స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా బయలుదేరి బిజెపి ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద గల శ్రీ మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిరసన తెలియజేశారు. డిసిసి అధ్యక్షులు బాబురావు మాట్లాడుతూ మోడీ దాదాపు పది సంవత్సరాలలో కుల, మతాల మధ్య చిచ్చు పెట్టాడని బిజెపికి వత్తాసు పలుకుతున్న వైసిపి టిడిపి దరిద్రపు పార్టీలు మన రాష్ట్రంలో ఉండడం శోచనీయమని, కాంగ్రెస్ ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు చేస్తున్న భారత్ జోడో న్యాయ యాత్రను బిజెపి ప్రభుత్వం అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని స్వాతంత్ర సమరయోధుడు భారత మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ వారసుడు శ్రీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా అస్సాం రాష్ట్రం నందలి హిందూ దేవాలయానికి వెళుతున్న రాహుల్ గాంధీ ని అడ్డుకోవడం దారుణమని బిజెపి మతచాందస వాదానికి నిదర్శనమని దేశంలో దళితులకు మైనార్టీలకు క్రైస్తవులకు రక్షణ లేకుండా పోతుందని దేశాన్ని నాశనం చేస్తున్నారని వచ్చే ఎన్నికల్లో బిజెపి పతనం ఖాయమని బాబురావు బిజెపి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప మాజీ డిసిసి అధ్యక్షులు ఎం సుధాకర్ బాబు పిసిసి ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు జాన్ విల్సన్ ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బి బతుకన్న, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు పోతుల శేఖర్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎస్ ప్రమీల సేవాదళ్ జిల్లా అధ్యక్షురాలు వెంకట సుజాత డిసిసి ఉపాధ్యక్షులు కే వెంకట్ రెడ్డి రియాజుద్దీన్ పిఎంఆర్ ప్రసాద్ ఏ వి నాయుడు డిసిసి ప్రధాన కార్యదర్శులు పోతుల శేఖర్, ఎం చంద్రశేఖర్ సత్యనారాయణ గుప్త ఎస్ నవీద్ సిటీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్ కార్యదర్శులు బి సుబ్రహ్మణ్యం శశిధర్ బోయ శీను మొదలగు వారు పాల్గొన్నారు.