జగనన్న ఆరోగ్య సురక్ష సేవలపై డా. రామగిడ్డయ్య ఆరా..
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రామగిడ్డయ్య గ గోవర్ధనగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బింగి దొడ్డి గ్రామాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంనకు హాజరయ్యారు మరియు ఉలిందకొండ గ్రామంలో సందర్శించి అక్కడ జరుగుచున్న జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్లకు హాజరయ్యి అక్కడ జరుగుతున్న క్యాంపుకు హాజరైన ప్రజలందరికీ వైద్య సేవలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు మరియు ముఖ్యంగా అక్కడికి స్పెషల్ ఆఫీసర్ గా వచ్చిన డాక్టర్ చంద్రశేఖర్తో కలిసి క్యాంపు ను సందర్శించి వచ్చిన ప్రజలందరికీ కూడా రక్త పరీక్షలు జరుగుతున్నాయా లేదా అని మందులు అందుతున్నాయా లేదా అని వారికి వైద్య సేవలు అందిస్తున్నారా అని ఆరా తీశారు మరియు క్యాంపుకు వచ్చిన పేషెంట్లకు ఫోల్డర్స్ బ్యాగ్స్ ఆరోగ్యశ్రీ కార్డులు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రామగిడ్డయ్య డాక్టర్ చంద్రశేఖర్ సార్ వైద్యాధికారులు అందజేశారు ఈ కార్యక్రమంలో వైద్యులు వైద్య సిబ్బంది గ్రామ ప్రజలకు వచ్చిన వారందరికీ కూడా పరిసరాల ప్రాముఖ్యత గురించి వివరించాలని ఆరోగ్య సేవలు గురించి వివరించాలని దోమలు ప్రబలకుండా గ్రామములో తీసుకొని వలసిన జాగ్రత్తగా గురించి తెలపాలని పంచాయతీ వారితో కలిసి వాటర్ ట్యాంకులు శుభ్రపరిపించి క్లోరినేషన్ చేయించాలని గ్రామాలలో చెత్తను ఎత్తించాలని మురికి కాలువలను శుభ్రపరిమించాలని పంచాయతీ వారితో కలిసి పని చేయాలని ఆశ ఏఎన్ఎం పాల్గొనాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వైద్య సిబ్బంది ఎమ్మెల్యే హెచ్పీలు ఆరోగ్య కార్యకర్తలు ఆశ తదితరులు పాల్గొన్నారు.