పోలీస్ ఫరెడ్ గ్రౌండ్ లో నేడు గణతంత్ర వేడుకలు..
1 min read
ఉదయం 9 గంటలకు పతాక ఆవిష్కరణ..
విద్యార్థిని, విద్యార్థులచే దేశభక్తిని ప్రబోధించే సాంస్కృతిక కార్యక్రమాలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : భారత 75వ గణతంత్ర దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలు ఈనెల 26వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు ఏలూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రారంభమవుతాయని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఉదయం 9 గంటలకు జాతీయ పతాకావిష్కరణ జరుగుతుందని, అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించడం జరుగుతుందన్నారు. 9. 15 ని.లకు జిల్లాలో అమలు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై సందేశం ఉంటున్నదన్నారు. 9. 30 ని.లకు పోలీసు కవాతు ఉంటుందని, 10 గంటలకు వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసి ప్రగతి శకటాల ప్రదర్శన ఉంటుందన్నారు. 10. 20 ని. లకు పాఠశాల విద్యార్థినీ విద్యార్థులచే దేశభక్తిని ప్రబోదించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించడం జరుగుతుందన్నారు. అనంతరం 10. 55 ని.లకు ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందచేయడం జరుగుతుందన్నారు. 11. 35 ని.లకు స్టాల్ల్స్ సందర్శించడం జరుగుతుందన్నారు.