వేగం కన్నా – ప్రాణం మిన్న
1 min readప్రయాణంలో యువత జాగ్రత్తలు పాటించాలి
ఆర్ ఈ పి ఎల్ ప్రాజెక్ట్ హెడ్ మదన్మోహన్
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ప్రయాణం చేసేటప్పుడు యువత స్పీడు తగ్గించి వాహనాన్ని నడపాలని, వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, కారు నడిపేటప్పుడు సీటు బెల్ట్ ధరించాలని రాయలసీమ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టు హెడ్ మదన్మోహన్ పేర్కొన్నారు. 35వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల లో భాగంగా గురువారం చెన్నూరులోని శ్రీ రాజరాజేశ్వరి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఆర్ఈపిఎల్ వారి సహకారంతో రోడ్డు భద్రత వారోత్సవాల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ హెడ్ మాట్లాడుతూ ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు వహించాలని ఆయన కోరారు. జాగ్రత్తల గురించి వాటి ప్రాముఖ్యత గురించి, సీటు బెల్టు హెల్మెట్ ధరించడం ద్వారా వాటి వలన జరుగు మంచి చెడులను విద్యార్థులకు వీడియో రూపంలో అవగాహన కల్పించారు. వేగం తగ్గించుకొని ప్రయాణిస్తే బాగుంటుందని ఇంటిదగ్గర మన వాళ్లు మనకోసం ఎదురు చూస్తుంటారు అన్న భావన ఉండాలని, అలాంటి ఆలోచనతో వాహనాలు నడపాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ హెడ్ అరుణ్ రాజ్, రూట్ మేనేజర్ కొండలరావు, రూట్ ఆఫీసర్ కుతుబుద్దీన్ భాష, మరియు రాజరాజేశ్వరి పాఠశాల డైరెక్టర్ చంద్రశేఖర్, కరస్పాండెంట్ డా రామసుబ్బమ్మ, శ్రీ రాజరాజేశ్వరి ప్రిన్సిపల్ గురుమూర్తి, రూట్ ఆపరేషన్స్ సిబ్బంది పాల్గొన్నారు.