ఆడుదాం- ఆంధ్ర కార్యక్రమం విజయవంతం
1 min readసీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయంతో నెరవేరింది
నగరపాలక సంస్థ కో- ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు
క్రీడా నైపుణ్యం ద్వారా మన రాష్ట్రానికి గుర్తింపు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఆడుదాం-ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ ఆశయంతో అయితే ప్రారంభించారు ఆ ఆశయం నెరవేరిందని ఏలూరు నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు అన్నారు.ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు ముగింపు కార్యక్రమం గురువారం స్థానిక ఏ ఎస్ ఆర్ స్టేడియం గ్రౌండ్స్ లో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ ఎం ఆర్ పెదబాబు మాట్లాడుతూ.క్రీడా నైపుణ్యం ద్వారా మన రాష్ట్రానికి గుర్తింపు తేవడం కోసం ఆడుదాం-ఆంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారన్నారు. సచివాలయ స్థాయి నుండి వయసుతో సంబంధం లేకుండా క్రీడా పోటీల్లో స్త్రీలు,పురుషులు ఉత్సాహంగా పాల్గొనడం ఎంతో ఆనందదాయకమన్నారు. క్రీడల్లో పాల్గొన్నవారు శారీరిక ఆరోగ్యం పొందుతారు అన్నారు.మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని ఆదేశానుసారం నియోజకవర్గంలో ఉన్న 79 గ్రామ,వార్డు సచివాలయాల పరిధిలో 14 వేల 914 మంది స్త్రీ,పురుషులు ఈ పోటీల్లో పాల్గొన్నారు అన్నారు. నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన క్రికెట్,కబాడీ, కో-కో విజేతలకు సర్టిఫికెట్స్,నగదు బహుమతులను అందజేశారు. క్రీడా అంబాసిడర్లు,పీఈటీలను ఈ సందర్భంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేసి శ్రీనివాసరావు, నూక పేయి సుధీర్ బాబు,ఈడ చైర్మన్ బుద్ధాని శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ నేరుసు చిరంజీవులు, హౌసింగ్ పీడీ,మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ,అదనపు కమిషనర్ సి.హెచ్ బాపిరాజు,డీ ఎస్ డి ఓ కార్పొరేటర్లు కర్రి శ్రీనివాసరావు, కల్వకల్లు సాంబ, బత్తిని విజయకుమార్, జనపరెడ్డి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.