ప్రజా అధికారి డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ సేవలు అభినందనీయం..
1 min readప్రభుత్వ అధికారిగా, ప్రజా సేవాలో జాతీయ, అంతర్జాతీయ పురష్కారాలు..
ప్రజల పక్షాన నిలిచే అధికారిగా పేరు, ప్రభుత్వ పథకాలు అమలులో ప్రత్యేక చొరవ..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అతనొక జిల్లా అధికారి గ్రామ పంచాయతీ అధికారిగా ఏలూరు జిల్లాకు సేవలు అందిస్తున్నారు. దేశం కోసం సైన్యంలో పనిచేసిన మాజీసైనికుడు కూడా, ప్రభుత్వ అధికారి అయినా ప్రజా సేవాలో జాతీయ, అంతర్జాతీయ పురష్కారాలు అందుకున్నారు. గత కొంత కాలంగా డీపీఓ హోదాలో పంచాయతీ రాజ్ శాఖకు జిల్లాలో ఎనలేని సేవలు అందిస్తున్న డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ కృషిని గుర్తించి 75వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జిల్లా ఉన్నత అధికారులు అతిధుల సమక్షంలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీద జిల్లా ఉత్తమ అధికారి పురష్కారం అందుకున్నారు. రెండు దశాబ్దాలుగా సామజిక న్యాయంకోసం పాటుపడుతున్న శ్రీనివాస విశ్వనాథ్ యస్సీ, యస్టీ, మైనార్టీ, బలహీన వర్గాలు, పేదలకోసం ప్రభుత్వ అదికారిగా, సామాజిక కార్యకర్తగా శ్రమించారని చెప్పచ్చు. ప్రభుత్వ గెజిటెడ్ అదికారిగా ఒకవైపు ప్రజలకు నిస్వార్థ సేవలందిస్తు మరోవైపు సమాజంలో వివక్షను ఎదుర్కుంటున్న వర్గాల తరుపున పోరాటాలు చేసిన సంధర్భాలు చాలా ఉన్నాయి. మాజీ సైనికుడైన విశ్వనాథ్ సేవలను పౌర సమాజం గుర్తించి గతంలో ట్రూ ఇండియన్, ప్రజాభందు, డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ జాతీయ పురష్కారాలతో సత్కరించడం జరిగింది. భారత నౌకాదళంలో దేశానికి సేవలందించి విశ్రాంతి అనంతరం గ్రూపు-1 అదికారిగా ఎంపికై మండల పరిషత్ అభివృద్ధి అదికారిగా తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పాడ కొత్తపల్లి, గొల్లప్రోలు, అంబాజీపేట ఇలా అనేక మండలంలో ప్రజలకు నిస్వార్థ సేవలందిస్తు వచ్చారు. ప్రజా అదికారిగా పేరున్న డీపీఓ శ్రీనివాస విశ్వనాథ్ సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించి ఆంధ్రప్రదేశ్ లో అనేక సంస్కరణలకు కేంద్రభిందువు అయ్యారు. రాష్ట్రంలో నిరుపేదలకు ఇస్తున్న సామాజిక బద్రతా పించన్ పథకానికి 2014లో యన్టీఆర్ భరోసా’ నామకరణం చేసి నాటి ప్రభుత్వం నుండి ప్రశంసలు అందుకున్నారు. ప్రభుత్వ అధికారిగా తాను పనిచేసిన మండలాలలో త్రాగునీటి సమస్యలను పరిష్కరించి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. గ్రంధాలయాలు లేని గ్రామాలలో వార్తాపత్రికలను యస్సీ, యస్టీ ఆవాసాలలో చదువుకుంటున్న యువతులకు అందుబాటులోకి తెచ్చి విద్యాభివృద్దికి కృషిచేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండలంలో మహిళలను సంఘటితం చేసి మద్యపాన ఉద్యమాన్ని నడపడిపి ‘బెల్ట్ షాపులను’ శాశ్వతంగా మూయించారు. సమసమాజ స్థాపన జరగాలంటే అసమానతలు లేని సమాజం కోసం అందరు కృషిచేయాలని కాంక్షించిన విశ్వనాథ్ తాను సేవలందించిన మండలాలలో మహాత్మాగాంధీ, జ్యోతిరావు ఫూలే, అంబేడ్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసి తోటి అదికారులకు ఆదర్శంగా నిలిచారు. రంపచోడవరం గిరిజన ఆవాసం యం. బూరుగుబంధలో కోయదొరల దాహార్తిని తీర్చి యుగాలుగా ఉన్న త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపారు. అంతే కాకుండా రాష్ట్రంలో యస్సీ, యస్టీ ఉప ప్రణాళిక చట్టం ఏర్పడడానికి దళిత, గిరిజన సంఘాలతో ఉద్యమించి సబ్ – ప్లాన్ అమలుకు కారకుడై గిరిజనోద్దరుడుగా పేరుపొందారు. వర్షాకాలంలో వృత్తి కోల్పోతున్న లక్షలాది మంది చేనేత కార్మికులకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని విశ్వనాథ్ డిమాండ్ చేసి ‘నేతభృతి’ పథకం ఏర్పాటుకు కారకులయ్యారు. రాష్ట్రంలో యస్సీ, యస్టీ ఉప ప్రణాళిక చట్టం రావడంలో, వీవర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు శ్రీనివాస విశ్వనాథ్ కృషి ఫలితమే అని చెప్పచ్చు. పలు ఉద్యోగ, ప్రజా సంఘాలలో చురుకైన పాత్ర పోషిస్తున్న విశ్వనాథ్ ప్రైవేట్ రిజర్వేషన్ పోరాట సమితి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడుగా, ఆ ఆ ఫౌండేషన్ గౌరవ సలహాదారుడిగా, బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా, ఉపాథిహమీ పథకం క్షేత్రస్థాయి సహాయకులు, సాంకేతిక సహాయకులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గౌరవ అధ్యక్షుడుగా, ఆంద్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ప్రదాన కార్యధర్శిగా, రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ గా, బీసీ జనసభ రాష్ట్ర కార్యధర్శిగా ఇలా అనేక పౌర సంఘాలలో సేవలు అందిస్తున్నారు. విశ్వనాధ్ చేస్తున్న సేవలను గుర్తించి అమెరికాలోని ‘దాన’ అనే అంతర్జాతీయ స్వచ్చంద సంస్థ 2015లో వారియర్ అఫ్ ది పూర్” పురష్కారంతో గౌరవించగా, అదే ఏడాది జనవరిలో ఆండ్రూస్ థియసోఫికల్ యునివర్సీటీ ప్రతినిధులు గౌరవ డాక్టరేట్ పురష్కారం ఇచ్చి శ్రీనివాస విశ్వనాధ్ ను సత్కరించారు. ఇదే క్రమంలో రాజమహేంద్రవరం, ఫిలంత్రోపిక్ సొసైటీ వారు సర్ ఆర్దూర్ థోమస్ కాటన్ జయంతిని పురష్కరించుకొని ‘సామాజిక సేవ కేటగిరీలో’ జాతీయ పురష్కారంతో సత్కరించారు. 2021, 2022 సంవత్సరంలో ప్రకాశం జిల్లా ఈడీ ఎస్సి కార్పొరేషనుకు సేవలు అందిస్తున్న సమయంలో మరుగున పడిన జీవో 492 బైటకు తీసి తనఖలో ఉన్న సుమారు 4000 ఎకరాల దళిత భూములను రుణ మాఫి చేయుంచి సుమారు 4000 నిరుపేద దళిత కుటుంబాల భూములను ప్రభుత్వ పరంగా ఉచితంగా ఇచ్చే ప్రయత్నం చేసి సుమారు 33 సంవత్సరాల సమస్యకు మోక్షం కల్పించారు. ప్రకాశం జిల్లా స్ఫూర్తితో ప్రభుత్వ తనఖలో ఉన్న 24000 ఎకరాల భూములను వేలాది ఎస్సీ కుటుంబాలకు ఉచిత పంపిణి చేసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసినప్పుడు కోవిడ్ విపత్తు సమయంలో జిల్లా ప్రజలను అప్రమత్తం చేసి లైవ్ శానిటేషయిన్, సూపర్ శానిటేషన్ కాన్సెప్ట్ పరిచయం చేసి సరైన పారిశుధ్య నిర్వహణతో ప్రజల మన్ననలు పొందారు. ప్రస్తుతం జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర, ఆడుదాం ఆంధ్ర, సామాజిక సమతా సంకల్ప్ తదితర ప్రభుత్వ కార్యక్రమాలను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలతో సమర్ధ వంతంగా నిర్వహించి ఏలూరు జిల్లా ప్రగతిని రాష్ట్రంలో ముందు వరసలో పెట్టినందుకు, ప్రజలకు చేరువుగా ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేస్తున్నందుకు జిల్లా యంత్రాంగం డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ సేవలను గుర్తించి ఉత్తమ సేవ పురష్కారం అందించింది.