NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్.ఐ నంబూరి రవికి ప్రశంస పత్రం

1 min read

మున్సిపల్ కార్యాలయంలో 75 వ గణతంత్ర వేడుకలు..

ఉద్యోగుల పనితీరు ద్వారానే ప్రశంసలు..

నగర కమీషనర్ నూర్జహాన్ పెదబాబు

ఆర్.ఐ నంబూరి రవికి ప్రశంసా పత్రం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచి కొంతమంది నగరపాలక సంస్థలో పనిచేసిన ఉద్యోగులకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ నూర్జహాన్ పెదబాబు మరియు కమిషనర్ వెంకటకృష్ణ  చేతుల మీదుగా ప్రశంసా పత్రం  రెవెన్యూ ఇన్స్పెక్టర్ నంబూరి రవి అందుకున్నారు. కమిషనర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ ఉద్యోగులు బాధ్యతాయుగంగా పనిచేయడం ద్వారానే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారని, వారి పనితీరు ద్వారానే అధికారులు గుర్తిస్తారని ప్రశంసిస్తూ కొనియాడారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, తంగిరాల రాము, ఇనపనూరి కేదారేశ్వరి, జుజ్జువరపు విజయనిర్మల, కో- ఆప్షన్ సభ్యులు మున్నుల జాన్ గురునాథ్ అధికారులు ఆర్యులు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా ప్రశంసా పత్రం అందుకోవడం ద్వారా ఉద్యోగ నాలో మరింత బాధ్యతలు పెరిగాయని అంకితభావంతో పనిచేస్తానని రవి అన్నారు.

About Author