PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెద్దపులి పాదముద్రలు సేకరించిన  అటవీశాఖ అధికారులు..

1 min read

సమాచారం ఎవరికైనా తెలిసిన అధికారిక టోల్ ఫ్రీ నెం. 1800-425-5909 తెలిజేయలి..

పులి కదలికలను నిరంతరం గమనించేందుకు అటవీశాఖ సిబ్బందిని బృందాలుగా నియమించాం.. 

సమీప గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్రధామ

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : ఏలూరు సెక్షన్ రామసింగవరం బీట్ పరిధిలోగల దెందులూరు మండలం పెరుగుగూడెం గ్రామ సమీపంలో సంచరిస్తున్న జంతువు పాదముద్రల పరిశీలించిన పిమ్మట పెద్దపులియొక్క పాదముద్రలుగా ప్రాధమికంగా నిర్ధారించడమైనదని జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్రధామ ఒక ప్రకటన లో తెలిపారు.  ఏలూరు అటవీ క్షేత్రం ఏలూరు సెక్షన్ రామసింగవరం బీట్ పరిధిలో గల దెందులూరు మండలం పెరుగుగూడెం గ్రామ సమీపంలో మొక్కజొన్న తోటలో శరీరంపై బంగారు మచ్చలు కలిగిన జంతువును ఈనెల 26వ తేదీన కొంతమంది చూచి సదరు జంతువు పెద్దపులిలాగ ఉందని సమాచారం ఇచ్చియుండగా సదరు ప్రదేశాన్ని అటవీశాఖ సిబ్బంది క్షుణంగా పరిశీలించిన పిమ్మట సదరు ప్రదేశంలో జంతువుయొక్క పాదముద్రలు సుమారు 18 సె.మీ. నిలువుగా 18 సె.మీ. అడ్డంగా కలిగియున్నవని, కనిపించిన జంతువుయొక్క పాదముద్రలు పరిశీలించిన పిమ్మట అవి పెద్దపులియొక్క పాదముద్రలుగా ప్రాధమికంగా నిర్ధారించడమైనదన్నారు.   ఈ జంతువు సంచరిస్తుందన్న వార్త గ్రామ ప్రజలకు తెలియడంతో వారు భయభ్రాంతులకు గురికాకుండా అటవీశాఖ సిబ్బందిని టీమ్ లుగా విభజించి పెద్దపులియొక్క కదలికలను నిరంతరం గమనిస్తున్నామన్నారు.   ఈ ప్రాంతంలో కనిపించిన పెద్దపులి వలన సదరు గ్రామానికి చెందిన ప్రజలకు గానీ, పశువులకు గానీ ఎటువంటి హానీ జరిగియుండనప్పటికీ సదరు గ్రామ ప్రజలు అడవి జంతువు సంచరిస్తున్న ప్రదేశంనకు ఒంటరిగా వెళ్లరాదని, గేదెలను, ఆవులను, మేకలను సదరు ప్రదేశానికి తొలుకొని వెళ్లరాదని, సమీప గ్రామాల ప్రజల అప్రమత్తంగా ఉండాలన్నారు. అటు విశాఖ అధికారులు సూచనలు ఇవ్వడం అయిందన్నారు.  సదరు పెద్దపులి కదలికలు గురించి సమీప గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడమైయిందన్నారు.   సదరు జంతువు గురించి ఎటువంటి సమాచారం ఎవరికైనా తెలిసిన ఎడల అటవీశాఖకు సంబంధించిన టోల్ ప్రీ నెంబరు.1800-425-5909 కు తెలియజేయాలని ఆయన కోరారు. పెద్దపులి ద్వారా ప్రజలయొక్క పెంపుడు జంతువులకు గానీ, వారికి గానీ, ఎట్టివిదమైన నష్టం కలిగిన ఎడల వెంటనే పైన తెలిపిన టోల్ ఫ్రీ నెంబరుకు తెలియజేసిన ఎడల ప్రభుత్వం వారికి వెంటనే అటవీశాఖ ద్వారా నష్టపరిహారం చెల్లిస్తుందన్నారు.  పశువుల పాకలవద్ద రాత్రిపూట ఎక్కువ వెలుతురు వచ్చే విధంగా దీపాలను ఏర్పాటు చేసుకోవాలని రాత్రి సమయంలో బయట తిరగరాదని, ఇందుమూలంగా ప్రజలకు ఆయన తెలియజేశారు.   పులికి ప్రజలు ఎవరైనా ఏవిధమైన హానీ అనగా ఉద్ధేశ్యపూర్వకంగా గాయపరచుట గానీ, చంపుటగానీ, చేసిన ఎడల వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం శిక్షార్హులని ఆయన తెలియజేశారు.  వివిధ సామాజిక మాధ్యమాలలో పులిని గురించి వస్తున్న అవాస్తవాలను నమ్మరాదని ఆయన కోరారు.

About Author