16 ఏళ్లలోపు పిల్లల డేటా సేకరించండి
1 min read– జేసీ( ఆసరా మరియు వెల్ఫేర్) ఎంకేవీ శ్రీనివాసులు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కోవిడ్–19 థర్డ్‌వేవ్ దృష్ట్యా 0నుంచి 16 ఏళ్ల పిల్లల డేటాను సేకరించాలని అధికారులను ఆదేశించారు జేసీ ( ఆసరా మరియు వెల్ఫేర్) ఎంకేవీ శ్రీనివాసులు. మంగళవారం తన ఛాంబరులో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్–19 థర్డ్ వేవ్ దృష్ట్యా సంసిద్ధతలో భాగంగా సేకరించిన డేటాలోcomarbid కేసులను గుర్తించి పిల్లల యొక్క పేర్లు మరియు చిరునామా తో సహా డేటాను ప్రామాణీకరణ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ, డిఈఓ, పిడి ఐసిడిఎస్ డిసీ లేబర్, పిడి యన్ సి యల్ పి, డిసి ఆర్ బి యస్ కె,ఎడి వికలాంగుల సంక్షేమ శాఖ, డెమో, డియస్ఓ, జువెనైల్ శాఖ మొదలగు వారు పాల్గొన్నారు.