విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం … జిల్లా ఎస్పీ
1 min readస్పందన కార్యక్రమానికి 66 ఫిర్యాదులు.
స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారుజిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి స్పందన కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
స్పందన కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 66 ఫిర్యాదులు వచ్చాయి.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …
1) రాజమండ్రి ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని ఇవ్వడం లేదని కన్సల్టెన్సీ పేరుతో కొంతమంది వ్యక్తులు మోసం చేశారని కర్నూలు కు చెందిన విష్ణు ఫిర్యాదు చేశారు.
2) ఆస్తి కోసం నా కుమారుడు చంపుతానని బెదిరిస్తున్నాడని రక్షణ కల్పించాలని హోళగుంద మండలం, హెబ్బటం గ్రామానికి చెందిన ఈశ్వరప్ప ఫిర్యాదు చేశారు.
3) మా భూమిని దౌర్జన్యంగా ఆక్రమించి సర్వేయర్ ను కొలతలు చేయనీయకుండా శ్రీనివాసులు, లక్ష్మీనారాయణలు అడ్డుపడుతున్నారని ఓర్వకల్లు మండలం, నన్నూరు గ్రామానికి చెందిన వెంకటస్వామి ఫిర్యాదు చేశారు.
4) పొలం కౌలుకు తీసుకున్న వ్యక్తి నకిలీఅగ్రిమెంట్ సృష్టించి మోసం చేస్తున్నాడు. మా పొలం కు కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్న కూడా 6 ఏకరాల జొన్న పంటను దున్ని నాశనం చేసిన నగరూరు గ్రామానికి చెందిన రంగన్న, ప్రభాకర్ ల పై చర్యలు తీసుకోవాలని ఆస్పరి మండలం, నగరూరు గ్రామానికి చెందిన ఊసేనప్ప ఫిర్యాదు చేశారు.
5) ట్రేడ్ X కంపెనీ పేరుతో సైబర్ నేరగాళ్ళు నా వాట్సప్ కు ఒక లింకు ను పంపి నా ఫోన్ లో ఉన్న డేటా సేకరించి నా ఖాతా నుండి రూ. 1 లక్ష 60 వేలు తీసుకొని నన్ను మోసగించారని , అయితే ఆ మొత్తం ను సైబర్ నేరగాళ్ళకు వెళ్ళకుండా ఫ్రీజ్ చేసిన మొత్తాన్ని సైబర్ ల్యాబ్ పోలీసులచే రికవరీ చేసి ఇప్పించగలరని ఎమ్మిగనూరు కు చెందిన రిజ్వాన్ భాషా ఫిర్యాదు చేశారు.
6) కడప జిల్లా కు చెందిన మంజునాథ రెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని నకిలీ ఉద్యోగాలు ఇప్పించి మోసం చేశాడని నాగాలాపురం గ్రామానికి చెందిన ఉపేంద్ర, కర్నూలు కు చెందిన విష్ణు చరణ్ లు ఫిర్యాదు చేశారు.
స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ హామీ ఇచ్చారు.ఈ స్పందన కార్యక్రమంలో డిఎస్పీ శ్రీనివాసులు , లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, సిఐ లు పాల్గొన్నారు.