కరువు రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కరువుతో నష్టపోయిన రైతులకు తక్షణమే పంట నష్ట పరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరువు రైతులకు నష్టపరిహారం చెల్లింపులు చేయాలని కోరుతూ, సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట రైతులతో ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తీవ్ర కరువు పరిస్థితుల్లో రైతులకు పంట నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పాలకులకు అధికారం పై ఉన్న శ్రద్ధ రైతులకు పంట నష్టపరిహారం చెల్లింపుల్లో లేదని అన్నారు.జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు నష్టపోయిన రైతుల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం, వివక్ష చూపుతోందని, ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు పరిహారం చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే పంట నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా నాయకులు బి వీరశేఖర్ డిమాండ్ చేశారు. వరుస కరువులతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. కరువు రైతులను ఆదుకోవలసిన ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎకరాకు 50 వేల పరిహారం వెంటనే రైతు ఖాతాలో జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా బ్యాంకుల్లో రైతుల తీసుకున్న పంట రుణాలు మాఫీ చేయాలని కోరారు. గత టిడిపి ప్రభుత్వంలో కూడా2018 సంవత్సరంలో కరువు మండలంగా ప్రకటించినప్పటికీ పరిహారమందించడంలో అప్పటి ప్రభుత్వము పూర్తిగాఫలమైందన్నారు. ఈ ఏడాది కూడా ఎన్నికల నేపథ్యంలో అదే పరిస్థితి నెలకొంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వలసలు నేపథ్యంలో విద్యార్థిని, విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం కలుగుతుందని వెంటనే మండలంలో సీజనల్ హాస్టల్ ఏర్పాటు చేయాలని కోరారు.