ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా మీరే బాధ్యులు..ఏపీకి సుప్రీం హెచ్చరిక !
1 min readపల్లెవెలుగు వెబ్: బోర్డు పరీక్షలలో ఒక్క ప్రాణం పోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు హెచ్చరించింది. పరీక్షల నిర్వహణ విషయంలో ఎందుకు అనిశ్చితి సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణ పై అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. పరీక్షలు నిర్వహించాలని పట్టుదల ఉంటే.. బలమైన కారణాలు చూపించాలని ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉంటుందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పరీక్షలు ఎందుకు నిర్వహించాలి ?. నిర్వహించాల్సిన అవసరం ఏంటని సుప్రీం కోర్టు ప్రశ్నించిందని ఆయన తెలిపారు. సుప్రీం కోర్టు ఏపీ, కేరళ ప్రభుత్వాల పై ఆగ్రహం వ్యక్తం చేసిందన్న వార్తల్లో నిజం లేదన్నారు. కేసు గురువారానికి వాయిదా వేశారని, అఫిడవిట్ లో అన్ని విషయాలు సుప్రీం కోర్టుకు తెలియజేస్తామని మంత్రి సురేష్ చెప్పారు.