ప్రజా వినతులపై ప్రత్యేక దృష్టి సారించండి
1 min read– జిల్లా రెవెన్యూ అధికారి బి.పుల్లయ్య
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: జగనన్నకు చెబుదాం – స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ప్రజా వినతులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి. పుల్లయ్య సంబంధిత అధికారులను సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటినరీ హాల్లో నిర్వహించిన జగనన్నకు చెబుదాం – స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి బి. పుల్లయ్య మాట్లాడుతూ స్పందన విజ్ఞప్తులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. దరఖాస్తులన్నింటిని వితిన్ ఎస్ఎల్ఎ లోగా ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఏ ఒక్క దరఖాస్తు బియాండ్ ఎస్ఎల్ఎ లోకి వెళ్లకుండా క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను రెండు రోజుల్లో క్లియర్ చేయాలని డిఆర్ఓ సంబంధిత అధికారులను ఆదేశించారు.
1) గోస్పాడు మండలం యాల్లూరు గ్రామ నివాసితుడు దూదేకు సిద్దయ్య తనకు ఎడమ కాలు, ఎడమ చేయి లేదని వికలాంగత్వ సర్టిఫికెట్ కూడా ఉందని తనకు వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాల్సిందిగా కోరుతూ డిఆర్ఓ కు దరఖాస్తు సమర్పించుకున్నారు.
2) గడివేముల మండలం పెసరవాయి గ్రామ నివాసితుడు తన తండ్రి మరణించారని తమకున్న సర్వేనెంబర్ 58లో 2.32 సెంట్లు, 59 లో 2.15 సెంట్లు వుందని సదరు స్థలాన్ని పాస్ బుక్ లో మా తల్లి గారి పేరు ఎక్కించి ఇవ్వాలని డిఆర్ఓ కు దరఖాస్తు సమర్పించుకున్నారు.
3)పాత కందుకూరు గ్రామ నివాసితుడు సుందరరాజు తనకు 2022 ఫిబ్రవరి మాసం నుండి వృద్ధాప్య పెన్షన్ ఆగిపోయిందని….తన కుమారుడు కారు కొన్నందున పెన్షన్ నిలిచిపోయిందని….బియ్యం కార్డులో తన కుమారుని పేరు తొలగించాలని కోరుతూ డిఆర్ఓ కు దరఖాస్తు సమర్పించుకున్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో 187 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా రెవిన్యూ అధికారికి అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఎల్ఏ లోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.