ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కరించాలి..
1 min readబిటిఏ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకై కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం..
ప్రభుత్వ నాన్చుడి ద్వారానే అనేక ఇబ్బందులు
బిపిఏ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు
జిల్లాలోనే ఉపాధ్యాయులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : రాష్ట్ర బిటిఏ శాఖ ఇచ్చిన పిలుపుమేరకు రెండవ దశలో భాగంగా మంగళవారం సాయంత్రం 4.30గంటలకు ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం మరియు జిల్లా కలక్టరేట్ వద్ద జిల్లా అధ్యక్షులు చెడే ధర్మలింగం అధ్యక్షతన నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీచర్ల సమస్యలపై ప్రభుత్వ నాన్చుడు ధోరణి వలన అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని ఉద్యోగుల సొమ్ము ఏమి చేసిందో చెప్పాలని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా జిల్లా బిటిఏ, బిటి ఏ శాఖ నిర్వహించే నిరసన కార్యక్రమానికి జిల్లాలోని ఉపాధ్యాయులు, కార్యకర్తలు మరియు శ్రేయోభిలాషులు హాజరై సమస్యల సాధనకై ప్రాతినిధ్యం చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు బోల్లిపో మనోజ్ కుమార్ మాట్లాడుతూ జగనమోహన్ రెడ్డి ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు సాధించే వరకూ పోరాడేతీరుతామని హెచ్చరించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోసిపో సాల్మన్ మాట్లాడుతూ ఉద్యోగుల సొమ్ము 8వేల కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేయడం అన్యాయం అన్నారు. ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోవడం ప్రభుత్వ తీవ్ర వైఫల్యం అన్నారు. బిటిఏ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ భూపతి రామారావు మాట్లాడుతూ టీచర్ల సర్వీస్ సంబంధిత సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. డిఎస్ సి 2003 టీచర్లకు సుప్రీం కోర్టు వారి ఉత్తర్వుల మేరకు పాత పెన్షన్ వర్తింప జేయాలన్నారు. ప్రతి హై స్కూల్ లో డా. బి.ఆర్ అంబేడ్కర్ మరియు సావిత్రి బాయి ఫూలే విగ్రహాలు ప్రతిష్టించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిమెల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ టీచర్ల న్యాయమైన డిమాండ్లను తీర్చని పక్షంలో పెద్ద ఎత్తున విజయవాడ ధర్నా చౌక్ లో రాష్ట్ర స్థాయి ధర్నా ఫిబ్రవరి 5న జరపగలమని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు కార్యకర్తలు హాజరై డిమాండ్లను వివరిస్తూ, పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి సాయిరాజు భల్లం, గిరిబాబు, ధనకాంత, కృపాకరన్, కలపర్తి శ్రీనివాసు, జేసుదాసు, కస్సే శ్రీను, పోలిమెట్ల శ్రీనివాస్, రఘు, జె సౌందర్యం, రాజు, సునీత, విమల, మరియు రామదాసు పాల్గొన్నారు.