లోపాలు లేకుండా కులగణన జరగాలి..
1 min readడీపీఓ శ్రీనివాస విశ్వనాధ్
వట్లూరులో ఇంటింటికి క్షేత్రస్థాయిలో పరిశీలన
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : పెదపాడు మండలంలో పవితమైన ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం కులగణన కార్యక్రమాన్ని చేపట్టిందని ఎటువంటి పొరపాట్లు లేకుండా క్షేత్రస్థాయి సిబ్బంది వివరాలు నమోదు చేయాలని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి మరియు దెందులూరు నియోజకవర్గం ప్రత్యేక అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. వట్లూరు గ్రామ సచివాలయం పరిధిలో డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ ఇంటింటికి తిరిగి కులగణన నమోదు ప్రక్రియ పరిశీలించారు. కులగణన నమోదు ప్రక్రియలో వ్యక్తి, కుటుంబ వివరాలు సేకరించి సెల్ ఫోన్ యాప్ లో పంచాయతీ సిబ్బంది నమోదు చేస్తారని, పెదపాడు మండలంలో 98% కులగణన సర్వే పూర్తయ్యిందని అన్నారు. నమోదు కాబడిన కుటుంబ వివరాల ఖచ్చితత్వాన్ని పరిశీలించడానికి ఏలూరుజిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ ఆదేశాలతో తాను క్షేత్రస్థాయి పరిశీలన చెప్పట్టడం జరిగిందని డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాస్, పంచాయతీ సిబ్బంది, వాలంటీరులు ఉన్నారు.