PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ ఆవిష్కకరణ..

1 min read

2024-25 వార్షిక రుణ ప్రణాళిక రూ.16,243 కోట్లు..

పాల్గొన్న జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్,

జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లాకు సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్‌ను జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ తో కలిసి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆవిష్కరించారు.  బుధవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్‌ను నాబార్డ్ డిడియం టి అనిల్ కాంత్ రూపొందించిన ఏలూరు జిల్లా పిఎల్ పి ను విడుదల చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్‌ జిల్లా ప్రగతికి సహకరించాలన్నారు. ఈ ప్రణాళికలో ప్రాధాన్యత రంగానికి మొత్తం ప్రొజెక్షన్  రూ. 16,243 కోట్లతో రూపొందించగా 2024-25 లో మొత్తం వ్యవసాయ అంచన రూ. 11,273 కోట్లతో రూపొందించారు.  ఇది మొత్తం ప్రొజెక్షన్‌లో 69,40%. మొత్తం వ్యవసాయంలో, పంట రుణం రూ. 6,306.29 కోట్లు కాగా వ్యవసాయ టర్మ్ లోన్ రూ. 4, 966.49 కోట్లు,  వ్యవసాయ మౌలిక సదుపాయాలురూ.  430.45 కోట్లు మరియు అనుబంధ కార్యకలాపాలు రూ.  7,508.93 కోట్లు కింద ఎంఎస్ఎంఇ రుణం కింద రూ. 2,240.27కోట్లగా అంచనా వేయబడింది. ఎగుమతి క్రెడిట్ రూ. 144.00 కోట్లు,  విద్య కింద రూ. 88.20.కోట్లు, హౌసింగ్ రూ. 473.04 కోట్లు, బ్యాంక్ క్రెడిట్ రూ. 44.22కోట్లు, రెన్యూవబుల్ ఎనర్జీ 13.37 కోట్లు, (ఆన్ ఫార్మల్ క్రెడిట్ కింది  రూ. 1336.92 లక్షలు, OJD/PMJD) రూ. 27.50కోట్లు కింద చూపించారు.  కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్ పర్సన్   వెజ్జు వెంకటేశ్వర్ రావు, సభ్యులు చిట్టూరి వెంకటేశ్వరరావు, నాబార్డు డిడిఎం టి. అనిల్ కాంత్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి వై. రామకృష్ణ, డిడి హార్టికల్చర్ డిడి రామమోహన్ , ఎల్‌డిఎం డి. నీలాద్రి, పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజరు మంజూ భార్గవి, డిసిఓ ఎన్. మిల్టన్, డిడి కెఎస్ వి నాగలింగాచార్యులు, మైక్రోఇరిగేషన్ పిడి పివిఎస్ రవికుమార్, సెరీకల్చర్ డిడి దిరిశాల వాణి, మార్కెఫెడ్ ఎడి సిహెచ్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.

About Author