విద్యాభివృద్ధిలో..‘మలబార్’ కృషి..భేష్..
1 min readనగర మేయర్ బి.వై. రామయ్య
- కేవీఆర్ కళాశాలలో 215 మంది విద్యార్థినులకు స్కాలర్షిప్ పంపిణీ
కర్నూలు, పల్లెవెలుగు:భారతదేశంలో అతిపెద్ద బంగారు మరియు వజ్రాభరణాల వ్యాపార సంస్థలలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ…. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు కర్నూలు నగర మేయర్ బి.వి. రామయ్య. బుధవారం కర్నూలు కేవీఆర్ కళాశాలలో 215 మంది విద్యార్థినులకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ తరుపున స్కాలర్షిప్ల పంపిణీ చేశారు. కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నగర మేయర్ బి.వై. రామయ్య , జిల్లా డి.వి.ఈ.ఓ జమీర్ పాష, ఐసీడీఎస్ పీడీ వెంకకటలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ రామయ్య మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ అని, పేద విద్యార్థినులకు స్కాలర్షిప్ ఇస్తూ.. విద్యాభివృద్ధి కృషి చేయడం ప్రశంసనీయమన్నారు. అనతరం కర్నూలు షోరూమ్ స్టోర్హెడ్ ఫయాజ్, అసిస్టెంట్ స్టోర్ హెడ్ సమీర్, మార్కెటింగ్ మేనేజర్ నూర్ వుల్లా మాట్లాడుతూ ప్రతిభ ఆధారంగా 215 మంది విద్యార్థినులను గుర్తించామని, ఒక్కొక్కరికి రూ. 8వేలు నుంచి రూ.10వేలు చొప్పున రూ.18,46,000 మొత్తాన్ని చెక్కుల రూపంలో అందజేశామన్నారు. రానున్న రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్లో 5,500 మంది పేద విద్యార్థినులను ఎంపిక చేసి రూ. 8వేల నుంచి రూ.10వేల వరకు స్కాలర్షిపులు అందిస్తామని ఈ సందర్భంగా మలబార్ గ్రూపు ప్రకటించిందని తెలిపారు. పేద విద్యార్థులను విద్యలో ప్రోత్సహించాలన్న లక్ష్యంతో తమ సంస్థ స్కాలర్ షిప్లు అందజేస్తుందన్నారు. మలబార్ గ్రూపు నిబద్ధతలో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాలకు, దాతృత్వ కార్యకలాపాలకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లాభాలలో 5శాతం ఈ ప్రాంతంలో ఖర్చు పెడుతుందన్నారు. మలబార్ గ్రూపు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా గృహ నిర్మాణం, వైద్యసహాయం, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత మరియు విద్యారంగంలో దృష్టి సారిస్తుందని, గత 20 ఏళ్లుగా మలబార్ గ్రూపు వారే మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ రూ.38.32 కోట్లు పైగా వైద్య సహాయం కోసం వెచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేవీఆర్ కళాశాల విద్యార్థినులు, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్నూలు బ్రాంచ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.