PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక క్యాంపు

1 min read

పల్లెవెలుగు  వెబ్ చెన్నూరు : కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్-I ఆధ్వర్యంలో ఏడు రోజుల ప్రత్యేక క్యాంపు ను రామన పల్లె గ్రామంలో ప్రారంభించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.సలీం భాషా తెలియజేశారు, ఈ సందర్భంగా ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ, రామనపల్లెలో ఈ ప్రత్యేక శిబిర ప్రారంభానికి యోగి వేమన విశ్వవిద్యాలయం నుండి జాతీయ సేవా సమితి సమన్వయకర్త డాక్టర్ ఎన్. వెంకట్రామిరెడ్డి ముఖ్యఅతిథిగా వి చేయడం జరిగిందన్నారు, ఈ సందర్భంగా ఆయన ఎన్ ఎస్ ఎస్ యొక్క ప్రాధాన్యత గురించి ప్రత్యేక శిబిరంలో చేయవలసిన కార్యక్రమముల గురించి చక్కగా వివరించడం జరిగిందన్నారు, కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా కళాశాల ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు కళాశాల స్థాయిలోనే కాకుండా రాష్ట్ర , జాతీయ స్థాయిలో కూడా అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు, ఇటీవల కోటిరెడ్డి కళాశాల వాలంటీర్లు కర్ణాటకలో జరిగిన జాతీయ సమైక్యత శిబిరంలో పాల్గొన్నారనీ, యిక ముందు కూడా చురుగ్గా అన్ని రకాల క్యాంపులలో పాల్గొని సమాజ సేవలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది. విద్యార్థులు విద్య తో పాటు అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం హర్షించదగ్గ విషయమని కళాశాల ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది, ఎన్ ఎస్ ఎస్ లో ఉన్న విద్యార్థులు క్రమశిక్షణతో, సేవా దృక్పథంతో ఉండడమే కాకుండా విలువలు కలిగిన పౌరులుగా తయారవుతారని ప్రతి ఒక్కరూ ఎన్ ఎస్ ఎస్ లో చేరి తమవంతు కర్తవంగా సమాజానికి సేవ చేయాలని ప్రిన్సిపల్ కోరడం జరిగింది, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జి. విజయలక్ష్మి దేవి 7 రోజుల ప్రత్యేక శిబిరంలో తమ వాలంటీర్లు నిర్వహించే కార్యక్రమాల గురించి వివరించారు, ప్రత్యేక శిబిరంలో మొదటి రోజున స్వచ్ఛభారత్ కార్యక్రమం కింద రామన పల్లె గ్రామంలో ప్రభుత్వ పాఠశాల పరిసర ప్రాంతాలను వాలంటీర్లు శుభ్రం చేయడం జరిగింది, ఈ ప్రత్యేక శిబిర ప్రారంభములో కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు, యోగి వేమన యూనివర్సిటీ జాతీయ సేవా సమితి సమన్వయకర్త డాక్టర్ ఎన్. వెంకట్రామిరెడ్డి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జి. విజయలక్ష్మి దేవి, భాస్కర్ రెడ్డి,గురు మోహన్ రెడ్డి, రఘునాథ రెడ్డి, జిల్లా పరిషత్ హై స్కూల్ ఉపాధ్యాయులు లక్ష్మీకాంతమ్మ, సుబ్బ నరసయ్య, వాలంటీర్లు పాల్గొన్నారు.

About Author