ఎన్నికల సన్నద్ధత దిశగా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలి
1 min readరాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఎన్నికల సన్నద్ధత దిశగా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.శుక్రవారం విజయవాడలోని ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితా అంశాలపై అన్ని జిల్లాల జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఓటర్ల తుది జాబితా ప్రచురణ అయిన తరువాత ఓటర్ల తుది జాబితాలో తొలగింపులకు జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి అన్నారు. ఎక్కువ శాతం తొలగింపులకు ఎన్నికల కమీషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అదే విధంగా అర్హులైన ఓటర్లు ఉంటే వారితో దరఖాస్తులు చేయించి వారికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్నారు.. పెండింగ్ ఉన్న ఫార్మ్స్ ను త్వరితగతిన డిస్పోజ్ చేయాలన్నారు. ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ ప్లానర్ ప్రకారం చేయవల్సిన పనులను పూర్తి చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో పెండింగ్ ఉన్న Assured Minimum Facilities ను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ మురళీ తదితరులు పాల్గొన్నారు.