మీరు కోరితే ఇంటికే మద్యం..!
1 min readపోలీసులకు తెలుసా? తెలియదా?
రోజుకు 150 నుండి 200 బాటిల్ల వరకు అమ్మకం
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మద్యం కావాలని ఫోన్ చేస్తే చాలు మద్యం డోర్ డెలివరీ అవుతుంది. కాకపోతే 100 రూపాయలు బాటిల్ పై అధికంగా ఇవ్వాల్సిందే. కానీ ఒకే వ్యక్తి మూడు చోట్ల కేంద్రాల్లో ఏర్పాటు చేసుకుని మద్యం విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే అతను రోజుకు 150 నుండి 200 బాటిల్ వరకు మద్యం అమ్ముతాడని ప్రచారం జరుగుతుంది. ఇంత జరుగుతున్నా ఈ విషయం పోలీసులకు తెలుసా? తెలియదా? అని చెన్నూరులోని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలా మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకుని ఆ బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారన్న ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. ఆమత్యం ఇతర రాష్ట్రాల నుండి కూడా తెప్పిస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఎక్కడ చూసినా మద్యం బాటిల్లే మద్యం తాగే వారే కనిపిస్తున్నారని ,మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. అడ్డదారుల్లో అక్రమ సంపాదన ధ్యేయంగా నడిచే కొందరికి బెల్ట్ షాపులు వరంగా మారాయి. ఏ సమయమైనా సరే మా దగ్గరికి రండి మీకు మద్యం అందిస్తాం లేదా ఫోన్ చేయండి మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తాం అంటున్న బెల్ట్ షాప్ యజమానులని చెబుతున్నారు. ఉన్నతాధికారులు బెల్ట్ షాపులు నిర్వహించవద్దు ఎక్కడ ఉన్నాయని తెలిసినా లేదా సమాచారం ఇచ్చిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుందని, కాకపోతే చెన్నూరులో ఇదేంటని కొందరు మహిళలు ప్రశ్నిస్తున్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ప్రాంతాలలోని కుటుంబీకులు నిత్యం ఇబ్బందులు పడుతున్నట్లు, పగలు రేయి అన్న తేడా లేకుండా ఎల్ల వేళలా ఇళ్ల మధ్యలోనే మద్యం అమ్మకాలు ఏంటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా బెల్ట్ షాప్ యజమానుల జీవితాలు మూడు క్వాటర్లు ఆరు ఫుల్లులుగా సాగుతోందని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు.