PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతులు పంట నమోదు ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : రైతులు తాము చేసిన సాగు చేసిన పంట కు సంబంధించి పంట నమోదు ప్రక్రియను చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఐతే నాగేశ్వరరావు తెలిపారు, శుక్రవారం ఆయన మండలంలోని కనపర్తి గ్రామంలో రైతులు సాగుచేసిన పంటలను పరిశీలించారు, ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ, రైతుల పంట నమోదు ప్రక్రియను అలాగే సర్వే నంబర్ల వివరాలను రెండముగా తీసుకొని పొలంలో ఏ పంట ఉన్నది లేనిది తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు, అలాగే రైతులు తాము వేసిన పంటలకు ఈ- పంట నమోదు చేసుకోవాలని తెలిపారు, అలాగే పంట నమోదు చేసుకున్న రైతులు ఈ కేవైసీ చేసుకోవాలని తెలిపారు, అదేవిధంగా చెన్నూరులోని రైతు భరోసా కేంద్రం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన అక్కడ ఉండే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో మండల అగ్రికల్చర్ అధికారి కే శ్రీదేవి, విలేజి అగ్రికల్చర్ అసిస్టెంట్లు రఫీ, చరణ్ కుమార్ రెడ్డి, సృజన, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

About Author