భగవద్గీత ముక్తి దాయిని..
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: భగవద్గీతను ఆశ్రయిస్తే సకల శోకముల నుండి విముక్తిని కలిగించి, మానవుడికి జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందని ప్రముఖ వ్యాఖ్యాత, సంస్కృత పండితులు డాక్టర్ దివి హయగ్రీవాచార్యలు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం, కోటవీధిలో వెలసిన శ్రీ సీతారామ సమేత త్యాగరాజ స్వామి దేవస్థానం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో వారు శ్రీమద్రామాయణం, మహాభారతం భగవద్గీతలపై ధార్మిక ప్రవచనం చేశారు. ముగింపు సందర్భంగా భగవద్గీతపై చేసిన ప్రవచనాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, శ్రీ త్యాగరాజ స్వామి దేవస్థానం ధర్మకర్త రామాయణం శివరామకృష్ణ, శ్రీనివాసులు, సురేశ్ బాబు, పల్లా నాగరాజు, పత్తి మోహన్, బాల కొండారెడ్డి, పోలాసుధాకర్ బాబు, అర్చకులు యజ్ఞ రామశర్మ, సునీల్ శర్మ, భజన మండలి అధ్యక్షులు బాల నాగిరెడ్డి, శ్రీనివాసులు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.