NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అవగాహనతో.. ‘క్యాన్సర్​’ను జయించవచ్చు..

1 min read

ఒమేగా ఆస్పత్రి సీనియర్​ సర్జికల్​ అంకాలజిస్టు డా. రవీంద్రబాబు, డా. సుధీర్​ రెడ్డి

  • ప్రపంచ క్యాన్సర్​ దినోత్సవం సందర్భంగా నగరంలో ర్యాలీ
  • ముఖ్య అతిథిగా పాల్గొన్న రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి. పుల్లయ్య

కర్నూలు, పల్లెవెలుగు:ఆధునిక టెక్నాలజీతో క్యాన్సర్​ను నియంత్రించవచ్చని, కానీ ప్రజలు క్యాన్సర్​పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు ఒమేగా ఆస్పత్రి సీనియర్​ సర్జికల్​ అంకాలజిస్ట్​ డా. రవీంద్రబాబు. ప్రపంచ క్యాన్సర్​ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఒమేగా ఆస్పత్రి యాజమాన్యం, క్యాన్సర్​ సొసైటీ ఆఫ్​ కర్నూలు మరియు పుల్లయ్య ఇంజనీరింగ్​ కళాశాల వారు సంయుక్తంగా నగరంలోని సీ క్యాంప్​ నుంచి ఒమేగా ఆస్పత్రి వరకు  అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి. పుల్లయ్య, ఒమేగా ఆస్పత్రి యాజమాన్యం డా. ఆదిత్య, డా.వై. వెంకటరామి రెడ్డి, డా.బి. రవీంద్రబాబు, డా. సుధీర్​ రెడ్డి, డా. యు. ఉమామహేశ్వర్​ రెడ్డి తదితరులు అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్​ అంకాలజిస్ట్​ డా. రవీంద్రబాబు మాట్లాడుతూ.. ఈ ఏడాది ‘అందరికీ అందుబాటులో క్యాన్సర్​ వైద్యం’ అనే నినాదంతో క్యాన్సర్​ దినోత్సవం జరుపుకుంటున్నాము.  ప్రభుత్వ రంగం, జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల కృషి ఫలితంగా క్యాన్సర్​ఖు జిల్లాలో నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉంది. అవగాహనతో, ముందస్తు పరీక్షల సహాయంతో క్యాన్సర్​ను ప్రాథమిక దశలో  గుర్తించి సునాయసంగా జయించవచ్చని ఈ సందర్భంగా సీనియర్​ అంకాలజిస్ట్​ డా. రవీంద్రబాబు వెల్లడించారు. అనంతరం ఒమేగా ఆస్పత్రి అంకాలజిస్ట్​ వైద్యులు డా. సుధీర్ రెడ్డి మాట్లాడుతూ  ఆరోగ్యకమైన జీవనశైలి… క్రమశిక్షణతో క్యాన్సర్​ను నియంత్రించవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘వికసిత్​ భారత్​ 2047’ కల సాకారం కావాలంటే యువత  మంచి నడవడికతో  ఆరోగ్యంగా జీవించడమే ప్రధాన మార్గమని స్పష్టం చేశారు.  అంతకుముందు రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి.పుల్లయ్య మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిస కారాదన్నారు. ప్రతి రోజు వ్యాయామం తప్పకుండా చేయాలని, క్రమశిక్షణ గల జీవితంతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందన్నారు. అవగాహన ర్యాలీలో ఒమేగా ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు పాల్గొన్నారు.

About Author