వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన కలిసి అధికారంలోకి రావడం ఖాయం
1 min readమంత్రాలయం జనసేన ఇన్చార్జ్ బి లక్ష్మన్న
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి జనసేన కలిసి అధికారంలోకి రావడం ఖాయమని మంత్రాలయం జనసేన ఇన్ఛార్జ్ బి లక్ష్మన్న ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మండల పరిధిలోని రచ్చమరి గ్రామంలో జనసేన పార్టీ మండల నాయకులు ఏసేబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరణ చేశారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఇన్చార్జ్ బి లక్ష్మన్న హాజరయ్యారు. అనంతరం బి లక్ష్మన్న మాట్లాడుతూ త్వరలో జరగబోవు ఎన్నికల్లో జనసేన పార్టీ కార్యకర్తలు టిడిపి పార్టీ కార్యకర్తలు కలిసి ఐకమత్యంగా జనసేన టిడిపి పార్టీ ప్రభుత్వం స్థాపించే విధంగా అందరూ సైనికు లా పనిచేయాలని కార్యకర్తలకు లక్ష్మణ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్, జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. జనసేన టిడిపి పొత్తులో భాగంగా, జనసేన టిడిపిలో ఎవరిని అభ్యర్థులుగా ప్రకటించిన వారి గెలుపునకు మా శాయశక్తుల కృషిచేసి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తామని లక్ష్మన్న తెలిపారు. జనసేన పార్టీ బలోపేతానికి మంత్రాలయం నియోజకవర్గం లోని అన్ని గ్రామాలలో పర్యటించి జనసేన పార్టీ కార్యకర్తలను చైతన్యపరిచి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరిచి జనసేన పార్టీ పటిష్టత కొరకు అందరూ సైనికులాగా పనిచేయాలని సూచించారు. రాబోయేది జనసేన టిడిపి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఏసోబు, గోపాల్, రమేష్, వీరారెడ్డి, ప్రసాద్, రాజు, బివి రవిచంద్ర, నరసింహులు,టిడిపి నాయకులు నరసింహులు, ఈరప్ప, నారాయణ, నాగేంద్ర, రామాంజనేయులు, బొజ్జప్ప, చిదానంద, జనసేన టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.