పోచిమి రెడ్డి సేవాదళ్ సంస్థలో చేరిన 80 మంది యువకులు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పోచిమి రెడ్డి సేవాదళ్ సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై దూదేకొండ గ్రామానికి చెందిన 80 మంది యువకులు పోచిమి రెడ్డి మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సేవాదళ్ సభ్యత్వం పొందారు. ఈమేరకు సోమవారం దూదే కొండ గ్రామానికి చెందిన “సోను సూద్ హర్ష సాయి బ్లడ్ డొనేషన్ గ్రూప్” సభ్యులు పోచిమి రెడ్డి మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సేవాదళ్ సంస్థ నందు సభ్యత్వం తీసుకున్నారు. గత మూడు సంవత్సరాలుగా పత్తికొండ నియోజకవర్గంలో చేస్తున్న సేవాదళ్ సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై తమ స్వగ్రామమైన దూదే కొండ గ్రామంలో కూడా సేవాదళ్ కార్యక్రమాలు కొనసాగించాలనే ఉద్దేశంతో సభ్యత్వం తీసుకున్నట్లు బ్లడ్ డొనేషన్ గ్రూప్ అధ్యక్షుడు దూదేకొండ పెద్దరాయుడు తెలిపారు. ఇకపై మురళి అన్న చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ గ్రూపు సభ్యులందరూ పాల్గొంటామని తెలిపారు. ఇకముందు దూదేకొండ గ్రామంలో ఎవరైనా అకాల మరణం చెందితే ఆ కుటుంబానికి సేవాదళ్ తరఫున వెయ్యి రూపాయలు అంతిమ సంస్కారాలకు అందజేయడం జరుగుతుందని మురళీధర్ రెడ్డి ప్రకటించారు. అమ్మవారిశాల దగ్గర్లోని సేవాదళ్ కార్యాలయము నందు జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ బోడా సావిత్రి, ఎంపీటీసీలు అనిత, సరోజ ,మాజీ గ్రామ ఉపసర్పంచ్, కె.కోటేశ్వరరావు, కె .గోవిందరాజు మరియు సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.