కర్నూలు రేంజ్ నూతన డిఐజిగా సిహెచ్. విజయ రావు బాధ్యతలు
1 min readశాంతిభద్రతల పరిరక్షణ లో గట్టి గా పని చేస్తాం.ప్రజలకు ఏల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.
శాంతిభద్రతలకు ఏలాంటి విఘాతం కలగకుండా గట్టి చర్యలు తీసుకుంటాం.అన్ని శాఖల సమన్వయంతో టీమ్ వర్క్ గా పని చేస్తాం.
మిడియా సహాకరించాలి.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బాధ్యతలు స్వీకరించిన నూతన డిఐజి ని మర్యాదపూర్వకంగా కలిసిన… ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు. ఈ రోజు ఉదయం కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో కర్నూలు రేంజ్ నూతన డిఐజి గా శ్రీ. సిహెచ్. విజయ రావు ఐపియస్ పదవీ బాధ్యతలు చేపట్టారు.అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..కర్నూలు రేంజ్ డిఐజి గా రావడం మంచి అవకాశంగా భావిస్తున్నాను. శాంతిభద్రతల పరిరక్షణ నిర్వహణకు కర్నూలు రేంజ్ పరిధిలోని 4 (కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య) జిల్లాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఒక టీమ్ వర్క్ గా పని చేస్తాము. ప్రశాంత వాతావరణం కు అన్ని రకాల చర్యలు తీసుకుంటాము. ప్రజలకు ఏల్లప్పుడూ అందుబాటులో ఉంటాము. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శాంతిభద్రతలకు ఏలాంటి విఘాతం కలగకుండా గట్టి చర్యలు తీసుకుంటాము. కర్నూల్ రేంజ్ పరిధిలో ఉన్న పోలీసు అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పని చేస్తాము. పోలీసు యంత్రాంగానికి మిడియా సహాకారం అందించాలన్నారు. శ్రీ సిహెచ్. విజయ రావు ఐపియస్ గురించి….2010 ఐపియస్ బ్యాచ్ కు చెందిన వారు.చదువు : B.sc. MAస్వగ్రామం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా.పనిచేసిన ప్రాంతాలు…2010 లో అప్పా హైదరాబాద్. 2012 లో వరంగల్, కమిషనర్ ఆఫ్ పోలీసు సైబరాబాద్, నల్గొండ.2013 లో అనంతపురం, అసాల్ట్ కమాండర్ గ్రేహౌండ్స్.2014 లో ఎఎస్పీ రంపచోడవరం. 2015 లో ఎఎస్పీ సిఐడి హైదరాబాద్. 2016 లో కమాండెంట్ గా విజయనగరం 5 వ బెటాలియన్ లో పని చేశారు. ఎస్పీ గా…2017 లో గుంటూరు అర్బన్ , 2019 లో డిప్యూటి కమిషనర్ ఆఫ్ విజయవాడ, గుంటూరు , 2020 లో ర్వేల్వే విజయవాడ , 2021 లో నెల్లూరు , 2023 లో కమాండెంట్ గా కాకినాడ 3 వ బెటాలియన్ లో పని చేశారు. కాకినాడ 3 వ బెటాలియన్ లో పని చేస్తూ ఇటీవల డిఐజిగా పదోన్నతి పొందారు.2024 లో బదిలీ పై కర్నూలు రేంజ్ డిఐజి గా శ్రీ సిహెచ్. విజయ రావు ఈ రోజు పదవీ బాధ్యతలు చేపట్టారు. కర్నూలు రేంజ్ డిఐజి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో… కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి.కృష్ణకాంత్ ఐపియస్ ,నంద్యాల జిల్లా ఎస్పీ. శ్రీ కె.రఘువీర్ రెడ్డి ఐపియస్ , కడప జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ , అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ.బి.కృష్ణారావు ఐపియస్ , సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ ఎం. మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు ఉన్నారు.