కోటిరెడ్డి కళాశాల ఆధ్వర్యంలో అక్షరాస్యత పై అవగాహన
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ప్రతి కుటుంబంలో అక్షరాస్యత కలిగిన వారు ఉంటే ఆ కుటుంబం ఎంతో పరిణతి చెందిన కుటుంబం గా కొనియాడుతుందని, అంతే కాకుండా ప్రతి ఒక్క విషయంపై అవగాహన కలిగి ఉంటుందని కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి. సలీం భాష తెలిపారు, మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎన్ ఎస్ ఎస్ యూనిట్-1 ఆధ్వర్యంలో రామనపల్లెలో నిర్వహిస్తున్న 7 రోజుల స్పెషల్ క్యాంపులో భాగంగా మంగళవారం ఆరవరోజు అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినదని ఆయన తెలిపారు, అలాగే ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జి.విజయలక్ష్మి దేవి వాలంటీర్లతో కలిసి గ్రామములో అక్షరాస్యతపై అవగాహన ర్యాలీని నిర్వహించడం తో పాటు గ్రామములోని ప్రతి ఇంటికి వెళ్లి గ్రామీణులతో సంభాషించడం జరిగిందన్నారు, అలాగే ప్రతి ఇంట్లో అక్షరాస్యత కలిగిన కుటుంబ సభ్యులు యొక్క వివరాలను సేకరించడం జరిగినదదని తెలిపారు, నిరక్షరాస్యులుగా ఉన్న ప్రజలకు అక్షరాస్యత యొక్క ప్రయోజనాలను తెలియజేసి ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని తమ పిల్లలను తప్పకుండా పాఠశాలకు పంపించాలనితెలిపారు, గ్రామంలోని ప్రతి ఒక్కరు విద్యావంతులైనట్లయితే తమ గ్రామాభివృద్ధికి తోడ్పడిన వారు అవుతారని ప్రజలతో చెప్పడం జరిగిందని అన్నారు, ప్రతి కుటుంబంలో అక్షరాస్యత పెరిగినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందని, ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని విద్యావంతులైన యువతీ యువకులు వివాహము కూడా నిర్ణీత వయసు తర్వాత చేసుకుంటారని తెలియజేశారు, విద్యావంతులైన ప్రజలు సంతాన విషయంలో కుటుంబ నియంత్రణ విధానాలను పాటించడానికి అవకాశం ఉంటుందని ఫలితంగా దేశములో జనాభా కూడా నియంత్రించబడుతుందని ఆయన అన్నారు, అక్షరాస్యత కలిగిన పరిమిత కుటుంబము, చిన్న కుటుంబము చింత లేని కుటుంబం గా ఆనందంగా జీవించగలుగుతారని ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ అర్థశాస్త్ర అధ్యాపకురాలైన డాక్టర్ జి. విజయలక్ష్మి దేవి తెలియజేశారు. గ్రామంలో నిర్వహించిన అక్షరాస్యత సర్వే ద్వారా గ్రామ పెద్దలు, సచివాలయ అధికారులు, గ్రామీణ ప్రజలు అందించిన సమాచారాన్ని బట్టి రామన పల్లె గ్రామంలో దాదాపు 3500 మంది జనాభా ఉన్నట్లు, అందులో 60 శాతం మంది ప్రజలు అక్షరాస్యులుగా ఉన్నట్లు,అందులో స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా దాదాపు సమానంగా ఉన్నట్లు తెలియజేశారు, గ్రామ జనాభాలో 2527 మంది కాగా జనాభా ఓటు హక్కు కలిగి ఉన్నట్లు తెలిసిందని వారు తెలిపారు, ఈ సందర్భంగా ప్రతి విషయం లో తమకు సహకరించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి. సలీం భాషా, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వి.విజయలక్ష్మీదేవి వాలంటీర్లను అభినందించారు, తమ కళాశాల జాతీయ సేవా సమితి యూనిట్ -1 స్పెషల్ క్యాంపులో భాగంగా రామన పల్లె గ్రామంలో అందిస్తున్న సేవలను కొనియాడడం జరిగింది.