ప్రజలకు సంక్షేమ పథకాలు… అందించడంలో అధికారులు చొరవచూపాలి
1 min readహైవే బాధితులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయండి
మండల సమావేశంలోఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ఆయా శాఖల పరంగా అధికారులందరూ కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై రివ్యూ లు చేసి ఎక్కడెక్కడ ఏ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని , అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించడం అధికారుల యొక్క బాధ్యత అని ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ అన్నారు, మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సభా భవనంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ చీర్ల సురేష్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ, ఎంపీడీవో లు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు పెట్టడం జరిగిందన్నారు, దీని ద్వారా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందడంతో పాటు, ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకుంటే అధికారులు అనేక సార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించి, వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా చూడడం జరుగుతుందన్నారు,అలాగే ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న జాతీయ రహదారిలో ఇల్లు కోల్పోయిన బాధితులకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందని రెవిన్యూ అధికారులు స్పందించి వెంటనే వారికి ఇంటి స్థలాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఎంపీపీ తెలిపారు, అలాగే బుడ్డాయ పల్లె, బయనపల్లెలో అసంపూర్తిగా ఉన్న అంగన్వాడి పాఠశాలలు పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు, ఉపాధి హామీ పథకం ద్వారా కేవలం కాలువ పనులే చేస్తున్నారని, మరిన్ని చేపట్టేలా ఉపాధి హామీ అధికారులు చొరవ చూపాలని ఆయన తెలిపారు, కొండపేటలో ప్రభుత్వ సౌకర్య దుకాణాల ద్వారా వచ్చే బియ్యం సక్రమంగా పంపిణీ చేయలేదని, అలాగే కొండపేట లో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు లేదని సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్ అధికారుల దృష్టికి తీసుకు రావడం జరిగింది, దీనిపై డిప్యూటీ తాసిల్దార్ వెంకటరమణ మాట్లాడుతూ సక్రమంగా బియ్యం పంపిణీ చేసే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు, వైయస్సార్ కంటి వెలుగు వైద్య శిబిరాల ద్వారా అవ్వ తాతలకు 750 మందికి కంటి అద్దాలు అందించడం జరిగిందని, ఇంకా కొంతమందికి అందించాల్సి ఉందని త్వరలోనే అవి కూడా పూర్తి చేయడం జరుగుతుందని వైద్యాధికారులు తెలిపారు, అంతేకాకుండా నులిపురుగుల మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు, చెన్నూరు రెండవ వార్డులో కరెంటు స్తంభాలు నాటారే గాని వాటికి విద్యుత్ తీగలు కనెక్షన్ ఇవ్వలేదని ఎంపీటీసీ సాదిక్ అలీ తెలిపారు, వెంటనే ఆ పనులు అన్ని చేపట్టి పూర్తి చేస్తామని ట్రాన్స్కో అధికారులు తెలిపారు, అదేవిధంగా కనపర్తిలో చేపడుతున్న జగనన్న గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని, ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే వాటిని త్వరగ తిన ఎంపీపీ తెలిపారు, వేసవి కాలం మొదలైందని మండల వ్యాప్తంగా గ్రామాలలో ఎక్కడ కూడా త్రాగునీటి కొరత ఉండకూడదని అందరూ మండల అధికారులు సమిష్టిక కృషి చేసి ఎక్కడ ఏ సమస్య లేకుండా చూడాలని ఎంపీపీ తెలిపారు, ఈ సమావేశంలో ఇచ్చిన ప్రతి అంశం కూడా వచ్చే సమావేశాన్ని కల్లా పూర్తి చేసి పక్క సమాచారంతో సమావేశానికి రావాలని ఆయన అధికారులకు సూచించారు, కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ రామన శ్రీలక్ష్మి ,మండల ఉపాధ్యక్షుడు ఆర్ఎస్ ఆర్.ఆర్ (చిన్న), సొసైటీ అధ్యక్షులు అల్లి శ్రీరామమూర్తి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు సొంటం నారాయణరెడ్డి, చెన్నూరు సర్పంచ్ సిద్ధిగారి వెంకటసుబ్బయ్య, ముమ్మడి సుదర్శన్ రెడ్డి, మండల కో ఆప్షన్ నెంబర్ వారిష్, ఎంపీటీసీలు, నిరంజన్ రెడ్డి, నాగిరెడ్డి, సాదిక్ అలీ, అధికారులు తహసిల్దార్ పఠాన్ అలీ ఖాన్, ఎంపీడీవో సుబ్రహ్మణ్య శర్మ, ఈవోపీఆర్డీ సురేష్ బాబు,, డాక్టర్ చెన్నారెడ్డి, ఏపిఎం గంగాధర్, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.