వాహనాలు నడిపేటప్పుడు రహదారి భద్రత సూచనలు గుర్తించాలి..
1 min readఉల్లంఘించడం ద్వారా భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది..
ఎంవిఐ జి ప్రసాదరావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : వాహనాలను నడిపేటప్పుడు రహదారి భద్రత చిహ్నాలను ఉల్లంఘించడం వలన భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని మోటార్ వెహికల్స్ ఇన్స్ పెక్టర్ జి. ప్రసాదరావు అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఉప రవాణా కమిషనర్ శాంతకుమారి అధ్వర్యంలో మంగళవారం వట్లూరు శ్రీ చైతన్య జూనియర్ కళాశాల నందు రోడ్డు భద్రతపై కళాశాల బస్సు డ్రైవర్లు, క్లినర్లకు అవగాహన కల్పించారు. హెచ్చరిక చిహ్నాలు సాధారణంగా ఎరుపు అంచుతో త్రికోణం మరియు నీలం రంగులో ఉంటాయన్నారు. ఆగుము, దారి ఇవ్వుము చిహ్నాలు అష్టభుజి మరియు త్రికోణాకారములో ఉంటాయని తెలిపారు. చిహ్నాలను భేఖాతరు చేయడం వలన శిక్ష మరియు భారీ జరిమానాలు విధించబడతాయని హెచ్చరించారు.కార్యక్రమములో మోటార్ వెహికల్స్ ఇన్స్పిక్టర్లు కెవిఎస్.ప్రసాద్, జి.ప్రసాదరావు, జి.స్వామి, కళాశాల వాహనాల ఇంచార్జ్ మధు, డ్రైవర్లు, క్లినర్లు, సిబ్బంది పాల్గొన్నారు.