జర్నలిస్టులపై దాడులు అరికట్టాలి..
1 min readఅడిషనల్ ఎస్పీకి వినతి పత్రాన్ని అందజేసిన..
ఏ పిడబ్ల్యూజేఎఫ్ జిల్లా సంఘ నాయకులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : సోమవారం చింతలపూడి లో జరిగినతెలుగుదేశం పార్టీ “రా కదలి రా” సభ ఏర్పాట్లు చేస్తున్న సందర్భముగా తెలుగుదేశం పార్టీరా కదలి రా సభ కవరజ్ కి వచ్చిన మా జర్నలిస్ట్ సోదరులు ఏ పి డబ్ల్యూ జె ఎఫ్ సీనియర్నాయకులూ జర్నలిస్ట్ కే ఎస్ శంకరరావు, సీనియర్ జర్నలిస్ట్ రమణారావు పైదెందులూరు మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అతని అనుచరులు దాడి చేసిపాత్రికేయుల సెల్ ఫోన్లను లాక్కొని తీవ్ర పదజాలముతో దుర్భాషలాడారు. సదరుమీడియా పై జరిగిన దాడిని ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతంకాకుండా ఖండించాలని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ యంత్రాంగాన్నికోరుకుంటు ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ కి మంగళవారం నాడు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ డబ్ల్యు జె ఎఫ్ రాష్ట్ర సీనియర్ నాయకులు కె.బాలశౌరి, ఏలూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ డి జబీర్, వై వి హరీష్, ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు పి.గంగరాజు, శేఖర్, యర్రా జయదాస్ కార్యవర్గ నిర్వాహక కార్యదర్శి బి. విజయ్ కుమార్, మిల్టన్, స్టాలిన్, ప్రతాప్, సజ్జి , ఎస్ కే బాబ్జి ,దొరబాబు, వి జయరాం, తదితర జర్నలిస్ట్ సోదరులు పాల్గొన్నారు.