15 మంది తల సేమియా చిన్నారులకు రక్తమార్పిడి..
1 min readరెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి వెల్లడి
ఇన్నర్ వీల్ క్లబ్ మాజీ చైర్మన్ డాక్టర్ పి సుబ్బలక్ష్మి దంపతులు 15,000 చెక్కు అందజేత
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తల సేమియా భవనంలో 15 మంది తల సేమియా చిన్నారులకు రక్తమార్పిడిని నిర్వహించామని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏలూరు ఇన్నర్ వీల్ క్లబ్ బృందం తల సేమియా చిన్నారులను పరామర్శించారని, ఇన్నర్ వీల్ క్లబ్ మాజీ చైర్ పర్సన్ డాక్టర్ పి సుబ్బలక్ష్మి, హనుమంతరావు దంపతులు తల సేమియా కేంద్రానికి 16 వేల రూపాయల చెక్కును విరాళంగా అందజేశారని అన్నారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి వారికి మరియు ఈరోజు తల సేమియా చిన్నారులకు వారి సహాయకులకు ఉచిత భోజనం ఏర్పాటు చేసిన మల్లిశెట్టి తిరుమల రావు, కృష్ణ తులసి లకు అభినందనలు తెలిపారు. ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ క్రమం తప్పకుండా తల సేమియా చిన్నారులకు రక్త మార్పిడి చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్ఎస్ఆర్కే వరప్రసాదరావు, ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ పిఎస్ సుబ్బలక్ష్మి, కార్యదర్శి జి అచ్యుత, పి సుబ్బలక్ష్మి, వి వి వి హనుమంతరావు, కె.వి రమణ, వి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.