రైతు సంక్షేమమే..ప్రభుత్వ ధ్యేయం..
1 min readమంత్రి బుగ్గన చొరవతో.. డోన్ అభివృద్ధిలో పరుగులు..
- మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్
- వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మెట్టు వెంకటేశ్వర రెడ్డి
ప్యాపిలి, పల్లెవెలుగు:రైతుల సంక్షేమం.. అభ్యున్నతే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తోందన్నారు వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మెట్టు వెంకటేశ్వర రెడ్డి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోందన్నారు. ప్యాపిలి మండల పరిధిలోని మెట్టుపల్లి గ్రామంలో బుధవారం వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మెట్టు వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో రూ. 26 లక్షలతో సిసి రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మెట్టు వెంకటేశ్వర రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పంచాయతీ గ్రామాలలో రైతు భరోసా కేంద్రం, సచివాలయం, హెల్త్ క్లినిక్ సెంటర్లు నిర్మిస్తూ ప్రజల వద్దకే పాలన సాగిస్తున్నారన్నారు. అలాగే డోన్ నియోజకవర్గం శాసనసభ సభ్యులు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చొరవతో ప్యాపిలీ పట్టణమే కాదు, గ్రామలలో కూడా అభివృద్ధి పనులు వేగవంతం ముందుకు సాగుతోంది. అభివృద్ధి ఏమిటో తెలుసుకోవాలంటే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులను చూడాలని వ్యవసాయ మండలి సలహా చైర్మన్ మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకులకు హితవు పలికారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ మరోసారి విజయ ఢంకా మోగించడం ఖాయమని వ్యవసాయ మండలి సలహా చైర్మన్ మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
అభివృద్ధి పనుల.. ప్రారంభోత్సవం…:
అదేవిధంగా 38 లక్షల 40వేలతో సచివాలయం ,23 లక్షల 94 వేల తో రైతు భరోసా కేంద్రం ,12 లక్షలతో స్మశాన వాటిక ప్రాంగరి గోడలను జడ్పిటిసి సభ్యులు శ్రీరామ రెడ్డి ,ఎంపీపీ గోకుల్ లక్ష్మి, ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 40 ,50 సంవత్సరాల్లో అభివృద్ధి చేయని పనులు ఐదేళ్ల లోపు అభివృద్ధి పనులు చేసి చూపించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అభివృద్ధి అంటే వైయస్సార్ వైయస్సార్ అంటే అభివృద్ధి అని మాట నిలబెట్టిన మా ప్రభుత్వం వైయస్సార్ ప్రభుత్వమని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాయి మనోహర్, ఇఓ ఆర్ డి బాలకృష్ణ, పిఆర్ ఏ ఈ ప్రభాకర్ రెడ్డి, వైసిపి నాయకులు బోరా మల్లికార్జున్రెడ్డి, బోరెడ్డి ప్రభాకర్ రెడ్డి,బోరెడ్డి రఘునాథరెడ్డి ,చంద్రశేఖర్ రెడ్డి ,బండా సోమశేఖర్, మదనమోహన్, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, వ్యవసాయ అధికారి రాజేష్ తదితరులు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.