PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ రేషన్ బియ్యం పట్టివేత

1 min read

చెన్నూరు, పల్లెవెలుగు:కడప రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి  షేక్ మాసుం బాష గారి ఆదేశాల మేరకు కడప విజిలెన్స్ అధికారులు  కడప  సి ఎస్ డి టి లతోకలిసిబుధవారంతెల్లవారుజామున  చెన్నూరు అరుంధతివాడ కు చెందిన కొండూరు హరికృష్ణకు చెందిన షెడ్డులో చెన్నూరుకు చెందిన కాటం వీర బ్రహ్మయ్య చెన్నూరు తో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి రేషన్ బియ్యంను సేకరించి,అక్రమముగా నిల్వ ఉంచి రవాణా చేయుటకు సిద్ధంగా ఉన్నారనే సమాచారంతో పై షెడ్డును తనిఖీ చేయగా అందులో 102 బస్తాలు, 4802 కేజీల రేషన్ బియ్యం దాని విలువ రూ.1,94,481/- లుగా ఉన్నట్టు విజిలెన్స్ అధికారులు తెలిపారు, తగుచర్య నిమిత్తం 102 బస్తాల రేషన్ బియ్యంను పంచనామా ద్వారా స్వాధీనపరచుకొని కడప సీఎస్ డిటి కి అప్పగించడమైనది,  దీనిపై చెన్నూరుకు చెందిన కాటం వీరబ్రహ్మయ్య, కొండూరు హరికృష్ణ అనే వ్యక్తులపై చెన్నూరు పోలీస్ స్టేషన్ నందు క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ తనిఖీలలో విజిలెన్స్ అధికారులు  T.రెడ్డెప్ప, ఇన్ఫెక్షన్ ఆఫ్ పోలీస్, G.ఇదురు బాష,ఇన్స్పెక్టర్ పోలీస్, అగ్రికల్చర్ ఆఫీసర్  E.బాలగంగాధర రెడ్డి, కడప CSDT P.M.V.మనోజ్, ప్రొద్దుటూరు MLRI V.సాయి ప్రసాద్, ప్రొద్దుటూరు CSDT(I/c) M. సుదర్శన్ మరియు విజిలెన్స్ హెడ్ కానిస్టేబుల్ S.జనార్ధన రావు,  K. నాగేశ్వరరావు, M.కృష్ణా నాయక్,  P.సుదర్శన్ రెడ్డి మరియు  D.రంతు బాష తదితరులు పాల్గొన్నారు.

About Author