హాకీ పోటీల లోగోను ఆవిష్కరించిన డా. శంకర్ శర్మ
1 min read13వ రాష్ట్రస్థాయి హాకీ సబ్ జూనియర్ హాకీ పోటీల లోగోను ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులు డాక్టర్ బి శంకర్ శర్మ ఆవిష్కరించారు.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: గురువారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్ డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన లోగో కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. హాకీ అనగానే ధ్యాన్ చందును గుర్తుపెట్టుకోవాల్సి వస్తుందన్నారు. రాత్రిపూట చంద్రుని వెన్నెలలో ఆడుతున్నందువలన ఆయనకు ధ్యాన్చందని పేరు వచ్చిందన్నారు. మనదేశంలో హాకీ క్రీడా లో ఒలంపిక్స్ లో ఎన్నో పతకాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. హాకీ కర్నూలు ప్రధాన కార్యదర్శి దాసరి సుధీర్ మాట్లాడుతూ ఈనెల పది నుంచి 12వ తేదీ వరకు స్టేడియంలో 13వ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల విజయవంతానికి సహకరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బి రామాంజనేయులు, క్రీడా సంఘ ప్రతినిధులు టి. గంగాధర్, డి .ప్రవీణ్, జగదీష్ తో పాటు సబ్ జూనియర్ హాకీ ప్లేయర్స్ పాల్గొన్నారు.