ఆహార సంరక్షణపై విద్యార్థులకు అవగాహన
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: విద్యార్థులందరూ ఆహార సంరక్షణపై ఏ విధమైన జాగ్రత్తలు తెలుసుకోవాలనే వాటి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ సలీం భాష విద్యార్థులతో అన్నారు.గురువారం ఉదయం నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో టైమ్స్ సెంటర్ ఫర్ లర్నింగ్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆహార సంరక్షణ గురించి ఒకేషనల్ ట్రైనర్ నాయక్ సయ్యద్ రహీమున్నీసా ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు శిక్షణ కల్పించారు.ఈ సందర్భంగా ఆహార సంరక్షణపై నైపుణ్యం కలిగి ఉండటం ప్రతి విద్యార్థికి అవసరం అని ఫుడ్ ప్రాసెసింగ్ ట్రేడ్ పై అవగాహన కల్పిస్తూ బిర్యానీ మేకింగ్ మరియు హోటల్ మేనేజ్ మెంట్ పై విద్యార్థులకు తెలియజేశారు.విద్యార్థులలోని నైపుణ్యాలను వెలికి తీసి వారికి మంచి అవకాశాలను కల్పించవచ్చని అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమాలను విద్యార్థులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని మీకు రాబోయే రోజుల్లో ఇవి ఉపయోగపడే విధంగా మీరు ఉండాలని ట్రైనర్ నాయబ్ రహీమున్నిసా అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి గోవిందు తదితర ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.