ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు జీజీహెచ్ ఆదర్శంగా నిలవాలి
1 min readఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అవయవ దానం చేసిన పావని లత తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. ఇటీవల కర్నూలు పట్టనానికి చెందిన గజ్జల పావనిలత కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో హఠాత్తుగా చనిపోవడంతో పవనిలత మరికొంతమందికి ప్రాణదాతగా కావడం విశిష్టం వారి తల్లిదండ్రులు బిడ్డను కోల్పోయిన దుఃఖంలో ఉండి కూతురు అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చి వివిధ వ్యాధులతో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్న వారికి ప్రాణం పోశారు. మనిషి చనిపోతే శాస్త్రాలను,మతాలను చూడకుండా మానవత్వంతో మరి కొంతమందికి ప్రాణదాతగా కావాలి తప్ప మట్టిలో కలప వద్దు అని సమాజానికి ఏపీ ఎమ్మార్పీఎస్ విజ్ఞప్తి చేయడమైనది. నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి విజయవంతం చేసిన కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య నిపుణులను,వైద్యులను ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ వెంకట రంగా రెడ్డి గారిని కలిసి అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రికి ఇంకా మరిన్ని మౌలిక వసతులు, కొత్త యూనిట్ ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ కృషి చేయాలనే అవసరం ఉందని కోరారు. గుండెకు సంబంధించిన వ్యాధులను ముందస్తుగా గుర్తించడానికి అంజో గ్రామీ ఉచిత వైద్యం ప్రజలకు అందుబాటులోకి తేవాలని ముందుగా గుర్తించినట్లయితే కొంతమంది ప్రాణాలను కాపాడవచ్చు అని మాట్లాడడం జరిగినది.. ఈ కార్యక్రమంలో ఆంజనేయ మాదిగ, ప్రతాప్ మాదిగ, బైరాపురం రాజు, పైగిరి మధు,దాసు, జయన్న రాముడు,అభిలాష్ మహిళా నాయకురాలు సుజాత,సుంకులమ్మ తదితర కర్నూలు జిల్లా ఏపీ ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొనడం జరిగినది.