NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రగ్బీలో ఉన్నత ప్రతిభ కనబరిచిన బాలికలు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యార్థులు రగ్బీలో ఉన్నత ప్రతిభను కనబరిచారు.విశాఖపట్నం జివిఎంసీ లో ఈనెల రెండవ తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు జరిగిన పోటీల్లో మిడుతూరు కస్తూర్బా 8వ తరగతి బాలికలు బి.శృతి,కె.అక్షయ రగ్బీ పోటీలో రాష్ట్ర  స్థాయిలో మొదటి స్థానంలో నిలిచినట్లు పాఠశాల ఎస్ఓ విజయలక్ష్మి తెలిపారు.వీరిద్దరిలో నేషనల్ స్థాయిలో పాల్గొనే పోటీలో కె.అక్షయ ఎంపిక అయిందని అదేవిధంగా ఈనెల 12వ తేదీన గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ లో జరిగే ఆటల పోటీల్లో అక్షయ పాల్గొంటుందని తెలిపారు. ఉన్నత ప్రతిభ కనబరిచిన వీరిద్దరిని ఎస్ఓ మరియు పిఈటి సుమలత మరియు పాఠశాల సిబ్బంది అభినందించారు.

About Author