బాండెడ్ లేబర్ నిర్మూలన దినోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: శుక్రవారం కర్నూల్ నగరంలోని స్థానిక జిల్లా కోర్ట్ లోని లోక్ అదాలత్ న్యాయ సేవ సదన్ నందు SARDS ఎన్జీవో సహాయ సహకారంతో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సిహెచ్. వెంకట నాగ శ్రీనివాసరావు, శాశ్వత లోక్ అదాలత్ ప్రజాప్రయోజన సేవల అధ్యక్షుడు వెంకట హరినాథ్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎస్. మనోహర్, దిశ డి.ఎస్.పి ఐ. సుధాకర్ రెడ్డి, ట్రైనీ డి.ఎస్.పి పి. భవాని, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సాంబశివరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాండెడ్ లేబర్ అబాల్షన్ యాక్ట్, 1976 ప్రకారం ఎవరైనా సరే బాండేడ్ లేబర్ కింద పని చేయించుకుంటే లేదా వాళ్లతో గొడ్డు చాకిరి చేయించుకున్న వాళ్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అలాగే అలాంటి వారిపై మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 50 వేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని అన్నారు. అనంతరం ఎస్. మనోహర్ బాండెడ్ లేబర్ అబాల్షన్ ఆక్ట్, అలాగే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23, భారతీయ శిక్ష స్మృతి సెక్షన్లో 370, 370a, 374 గురించి తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో SARDS ఎన్జీవో సిబ్బంది, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, న్యాయ విద్యార్థులు, పారా లీగల్ వాలంటరీస్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.