కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ” కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాల గురించి పల్లెకు పోదాం ” అనే కార్యక్రమం ద్వారా మండలంలోని దౌలతాపురం ఎస్టీ కాలనీ లోనికి వెళ్లి అక్కడ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గురించి గిరిజనులకు వివరించడం జరిగిందని బిజెపి మండల శాఖ అధ్యక్షులు గాడి భాస్కర్ తెలిపారు, శనివారం ఆయన చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలైన విశ్వకర్మ యోజన, 80 కోట్ల మంది భారతీయులకు ఆహార భద్రత, రైతు సంక్షేమానికి భరోసా కింద పిఎం కిసాన్,ఉజ్వల యోజన పథకం ద్వారా 31.54 కోట్ల ఇళ్లకు ఎల్పిజి కనెక్షన్లు, ముస్లిం మహిళలకు ఆత్మగౌరవం భద్రతా హామీ కింద ట్రిపుల్ తలాక్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రజల కోసం పక్కా ఇండ్లు నిర్మాణం,ఆయుష్మాన్ భారత్ పథకం వంటి వివిధ పథకాలను వివరించడం జరిగిందన్నారు, అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత భారీ ఆరోగ్య బీమా పథకం 12 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య భీమా రక్షణ ,26 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ చేయబడిందని, అలాగే పీఎం జనోషధి పథకం, పీఎం జన్ ధన్ యోజన కింద 34.26 కోట్ల రూపే కార్డులు మంజూరి, 2.05 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లు, మేక్ ఇన్ ఇండియా తో మెట్రో రైల్, దేశంలోని 20 నగరాలలో 878 కిలోమీటర్ల మెట్రో నెట్వర్క్ వినియోగంలో ఉంది. మిషన్ ఇంద్రధనస్సు లో భాగంగా 4.45 కోట్ల మంది బాలులు,1.12 కోట్ల మంది గర్భిణీలకు టీకాలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటువంటి పథకాలు ఎన్నో ప్రవేశపెట్టి ప్రపంచంలోనే భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు, ఈ కార్యక్రమంలో,కమలాపురం నియోజకవర్గ కో కన్వీనర్ భరత్ రెడ్డి, ఉపాధ్యక్షులు లోమడ శివారెడ్డి, చెన్నూరు కన్వీనర్ బి వీర ప్రతాపరెడ్డి , ముకుంద రెడ్డి, ప్రవాసి కార్యకర్త కాశి , శివరాం ,కాశి విశ్వనాధ్, శివారెడ్డి, ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.