మధ్యాహ్న భోజనాన్ని తానీకిచేసిన ఎంఇఓ
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: మధ్యాహ్న భోజన పథకం లో అవినీతికి పాల్పడితే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఇఓ వెంకటేశ్వర నాయిక్ అన్నారు.ఈసందర్భంగా శనివారం ఆయన ప్యాపిలి పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకం లో న్యాతపై తానీకిలు చేస్తు ప్రధానోపాధ్యాయులని, విద్యార్థిని లను ఆరాతీశారు. వారు మధ్యాహ్నం భోజనం మోను ప్రకారం విద్యార్థులకుభోజనం అందింస్తు రుచి కరమైన వంటలు వండుతునట్లుమధ్యాహ్న భోజన నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల కు గుడ్డు పైనుంచి సారపార కాకపోవడం గుడ్డు ఇవ్వడం లేదని ,శనివారం నుంచి మోను ప్రకారం విద్యార్థులకు భోజనంలో ఉడికించిన గుడ్డును పంపించేస్తున్నామని,భోజనం అనంతరం తాగడానికి మంచినీటి సౌకర్యం కల్పించామని విద్యార్థుల కు ఇబ్బంది లేకుండా తమవంతు తమకృషి చేస్తున్నామని ప్రధానోపాధ్యాయులు ఎంఇఓ వెంకటేశ్వర నాయిక్ కు తెలిపారు.