ఫ్లెక్సీలు చించిన వారు ఎవరైనా.. తగిన మూల్యం చెల్లించక తప్పదు
1 min readడోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి
ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి
పల్లెవెలుగు వెబ్ డోన్ (ప్యాపిలీ): డోన్ పట్టణంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ తెలుగుదేశంపార్టీ ఫ్లెక్సీలను చించ్చడంతో, చించ్చిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి టిడిపి నాయకులుతో డోన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు శనివారం సి.ఐ కి పిర్యాదు చేశారు. విలేకర్లతో ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి మాట్లాడుతూ డోన్ పట్టణంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ తెలుగుదేశంపార్టీ ఫ్లెక్సీలు చించడం , కొయ్యడం చేసిన వారిని పట్టుకొని వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో సి.ఐ కి పిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. గతంలో 23.01.2024 తేదిన ఫెక్సీ చింపినపుడు పిర్యాదు చేయడం జరిగిందని, ఇది రెండవసారి పిర్యాదు చేయడం అని అన్నారు. ఫ్లెక్సీలు చించ్చినంత మాత్రాన ప్రజల గుండెలో ఉన్న నన్ను చేరపలేరని, ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడిన వారు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.