PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హొళగుందలో పూజలందుకుంటున్న మారెమ్మ

1 min read

దేవిని దర్శించుకుంటున్న భక్తులు

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  మండల కేంద్రం హొళగుందలో శనివారం మారెమ్మ దేవి దేవరలో భాగంగా జరిగిన కుంభోత్సవ కార్యక్రమం ఘనంంగా జరిగింది. ఉదయం స్థానిక పెద్దబావి వద్ద గంగిపూజ నిర్వహించిన భక్తులు అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి కుంభాన్ని ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అవ్వరు అభిషేకాలు, మహామంగళారతి, నైవేద్య సమర్పణ, భజన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని భక్తులు వివిధ రకాల వంటలతో దేవికి నైవేద్యం సమర్పించారు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఉత్సవ నిర్వాహాకులు తెలిపారు.

About Author