NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి గుర్తింపు తీసుకురావాలి

1 min read

సత్య రాజ్ సేవలు మరువలేనివి

టిటిడి పాలకమండలి సభ్యులు వై సీతారామి రెడ్డి

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం :  విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి గుర్తింపు తీసుకురావాలని టిటిడి పాలకమండలి సభ్యులు వై సీతారామి రెడ్డి సూచించారు. శనివారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో రాఘవేంద్ర జూనియర్ మరియు డిగ్రీ కళాశాల 7 వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రాలయం లో ఒకప్పుడు పెద్ద చదువులు చదవాలంటే దూర ప్రాంతాల కు వెళ్ళవలసి వచ్చేది కాని స్వర్గీయ సత్యరాజ్ ఇక్కడ పెద్ద చదువులు చదివేటందుకు వృక్షం నాటడం తో ఎక్కడకు వెళ్ళనవసరం లేదన్నారు ఆయన సేవలు మరువలేనివి అని కొనియాడారు. డిగ్రీ కళాశాల స్థాపించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని కళాశాల కు, ప్రిన్సిపాల్ కు, మంత్రాలయం మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఇక్కడ చదివిన విద్యార్థులు వివిధ రంగాల్లో మంచి స్థానం లో ఉన్నారని తెలిపారు. కళాశాల కు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, నేను మా తనయులు తరుపున ఎప్పటికీ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కళాశాల సిబ్బంది సీతారామి రెడ్డి ఘనంగా సన్మానించారు. ఆకట్టుకున్న విద్యార్థుల నృత్యాలు :- కళాశాల లో విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైకాపా మండల అధ్యక్షులు బీంరెడ్డి, ఇన్చార్జ్ విశ్వనాథ్ రెడ్డి, సర్పంచు తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచు హోటల్ పరమేష్, గోరుకల్ కృష్ణ, మల్లికార్జున,శివప్ప, అశోక్ వర్మ, ప్రిన్సిపాల్ సుబ్బారాయుడు, లెక్చరర్లు పాల్గొన్నారు.

About Author